Karnataka: కర్నాటక అసెంబ్లీలోకి గుర్తుతెలియని వ్యక్తి.. ఎమ్మెల్యే సీటులో దర్జాగా  కూర్చున్న సామాన్యుడు..

Karnataka: కర్నాటక అసెంబ్లీలోకి గుర్తుతెలియని వ్యక్తి.. ఎమ్మెల్యే సీటులో దర్జాగా కూర్చున్న సామాన్యుడు..

Anil kumar poka

|

Updated on: Jul 14, 2023 | 9:28 PM

కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ .. తాజాగా భద్రతా వైఫల్యం బయటపడింది. అసెంబ్లీలో ఓ వైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్‌ సమర్పిస్తుండగా.. ఓ వ్యక్తి సభలోకి వచ్చాడు. దర్జాగా ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్నాడు.

కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ .. తాజాగా భద్రతా వైఫల్యం బయటపడింది. అసెంబ్లీలో ఓ వైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్‌ సమర్పిస్తుండగా.. ఓ వ్యక్తి సభలోకి వచ్చాడు. దర్జాగా ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్నాడు. తీరా చూస్తే అతడు ఎమ్మెల్యే కానే కాదు.. ఓ సామాన్యుడు! మరో ఎమ్మెల్యే చూసి విషయం చెప్పడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యే కరియమ్మ కూర్చోవాల్సిన స్థానంలో గుర్తుతెలియని వ్యక్తి కూర్చున్నట్లు అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో మార్షల్స్‌ అతడిని బయటకు తీసుకెళ్లారు. సదరు వ్యక్తిని 70 ఏళ్ల తిప్పే రుద్రప్పగా గుర్తించారు. విజిటర్స్‌ పాస్‌ సంపాదించిన రుద్రప్ప.. తాను ఎమ్మెల్యేనని చెప్పి లోపలకు ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అనుకుని మార్షల్స్‌ సైతం అడ్డుచెప్పకపోవడంతో సభలోకి సులువుగా ప్రవేశించి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్నాడని వివరించారు. రుద్రప్పపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతడి మానసిక స్థితిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...