Vijayawada: వైఎస్‌ఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చేసిన టీడీపీ కార్యకర్తలు..
ఏపీలో కూటమి బంఫర్ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమైపోయింది. దీంతో టీడీపీ కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు టీడీపీ కార్యకర్తలు.
ఏపీలో కూటమి బంఫర్ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమైపోయింది. దీంతో టీడీపీ కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు టీడీపీ కార్యకర్తలు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు చేస్తూ అసెంబ్లీలో సవరణ బిల్లును గతంలో వైసీపీ సర్కార్ పాస్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా వెనక్కి తగ్గని వైసీపీ సర్కార్ పేరును మార్చేసింది. తాజాగా టీడీపీ కూటమి అధికారంలోకి రావడం పక్కా అవ్వడంతో టీడీపీ శ్రేణులు ఆ పేరును మళ్లీ ఎన్టీఆర్ గా మార్పు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jun 04, 2024 04:16 PM
వైరల్ వీడియోలు
Latest Videos