PM Modi in US: మోడీ మాటల్లో.. అమెరికా అత్యంత విలువైన వాటిని భారత్ కు తిరిగి ఇచ్చేసింది..!(వీడియో)

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసింది. అమెరికా పర్యటన సందర్భంగా మోదీకి అమెరికా కొన్ని కానుకలను ఇచ్చింది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, ఆస్ట్రేలియా పీఎం, టాప్ సీఈవోలతో భేటీ అయ్యారు.

PM Modi in US: మోడీ మాటల్లో.. అమెరికా అత్యంత విలువైన వాటిని భారత్ కు తిరిగి ఇచ్చేసింది..!(వీడియో)

|

Updated on: Sep 29, 2021 | 8:23 AM

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసింది. అమెరికా పర్యటన సందర్భంగా మోదీకి అమెరికా కొన్ని కానుకలను ఇచ్చింది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, ఆస్ట్రేలియా పీఎం, టాప్ సీఈవోలతో భేటీ అయ్యారు. మోడీ బైడెన్ లు ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతం, వాణిజ్య, వారసత్వ సంపద, సాంస్కృతిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోడీకి అమెరికా 157 కళాకృతులు, పురాతన వస్తువులను బహుమతిగా అందజేసింది. ఆ బహుమతులను మోడీ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు..

ఈ బహుమతులన్నీ 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దానికి చెందిన వస్తువులుగా తెలుస్తోంది. వీటిలో దాదాపు సగం కళాఖండాలు కాగా వాటిపై లక్ష్మీ నారాయణ, బుద్ధుడు, విష్ణువు, శివపార్వతులు , 24 మంది జైన తీర్థంకరులు , కంకలమూర్తి, బ్రాహ్మీ , నందికేసుల ప్రసిద్ధ భంగిమలతో అలంకరించబడిన బొమ్మలు ఉన్నాయి.మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2021 మధ్యలో 200కి పైగా పురాతన వస్తువులు ఇతర దేశాలనుంచి మనదేశానికి తిరిగి వచ్చాయని అధికారులు తెలిపారు. అంతేకాదు ఇప్పుడు అమెరికా భారత్ కు అందజేసిన వస్తువులను గురించి చెబుతూ అవి 11వ శతాబద్ధం, 14వ శతాబ్దానికి చెందిన వస్తువులని, బీసీ కాలం నాటి రాగి, టెర్రాకోట వంటి చారిత్రక పురాతన వస్తవులు కూడా ఉన్నాయని తెలిపారు.

హిందూ మతానికి చెందిన మూడు తలల బ్రహ్మ, రథాన్ని నడిపిస్తున్న సూర్యుడు, విష్ణు లక్ష్మీదేవి. శివుడు దక్షిణామూర్తిగా, గణేశుడు నృత్యంభంగిమ కాగా ఇక బౌద్ధమతానికి చెందిన బుద్ధుడు, బోధిసత్వ మజుశ్రీ, తారా విగ్రహాలు ఉన్నాయి. ఇక జైనమతానికి చెందిన జైన్ తీర్థంకర, పద్మాసన తీర్థంకర, జైన చౌబిసి వంటి అనేక విగ్రహాలు అమెరికానుంచి మోడీ భారత్ కు తిరిగి తీసుకొచ్చారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Adire Abhi Movie Record: ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‏లో జబర్ధస్త్ కమెడియన్ సినిమా..!(వీడియో)

 Intrusting Video: వందేళ్లయినా.. ఈమెకు వృద్ధాప్యం రాదు.. ఎందుకో తెలుసా.. (వీడియో )

 Viral Video: మొసలి భారీ నుండి బిడ్డ ప్రాణాలకు తల్లి ప్రాణం అడ్డు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..(వీడియో)

 Eiffel Tower video: ఈఫిల్ టవర్‌ను ఫోటో తీయకూడదా..? ఎందుకో తెలుసా..?(వీడియో)

Follow us
Latest Articles