News Watch Live: TDPతో టచ్ లో 40 మంది MLAలు..!..ఎవరు వాళ్ళు..! ఇది నిజమేనా..? వీక్షించండి న్యూస్ వాచ్..
టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 40 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రోజూ ఫోన్లు వస్తున్నాయని.. అయితే పార్టీ చర్చించి ఎవరిని చేర్చుకోవాలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.
టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 40 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రోజూ ఫోన్లు వస్తున్నాయని.. అయితే పార్టీ చర్చించి ఎవరిని చేర్చుకోవాలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలతో మాతో ఇంకా టచ్‌లోకి రాలేదన్నారు. 40 మంది పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు అచ్చెన్నాయుడు. పొత్తులు కొత్తకాదు.. అయితే పొత్తులపై పార్టీలో ఎలాంటి చర్చా జరగలేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలతో కలిసిపనిచేయాలని మాత్రమే నిర్ణయించాం. ఎన్నికల సమయంలో పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు అచ్చెన్నాయుడు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మంగళవారం (మార్చి 28) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.
Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..
Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..