Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దొంగ దీక్షలు చేస్తున్నారు అంటూ చంద్రబాబు చేపట్టిన ‘సాధన దీక్ష’పై మంత్రి ఆళ్ల నాని ఫైర్..:Alla Nani slams Chandrababu video.

Anil kumar poka

|

Updated on: Jul 01, 2021 | 4:42 PM

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేపట్టిన ‘సాధన దీక్ష’పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మంగళవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు చేసే దీక్షలకు ఎంతటి హీనమైన చరిత్ర...

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేపట్టిన ‘సాధన దీక్ష’పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మంగళవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు చేసే దీక్షలకు ఎంతటి హీనమైన చరిత్ర ఉందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అవినీతి మయం చేస్తూ నవ నిర్మాణ దీక్ష పేరుతో ఎంత దోచుకున్నారో కూడా తెలుసునని విమర్శించారు. అలాంటి దోపిడీ దారుడైన చంద్రబాబు ఇప్పుడొచ్చి.. దీక్షల పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని గుర్తు చేసిన ఆయన.. రెండవ దశనూ అంతే స్థాయిలో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే రాష్ట్రంలో కరోనా మరణాలు అతి తక్కువ నమోదు అయ్యాయని పేర్కొన్నారు.ఇంతకాలం హైదరాబాద్‌లో కూర్చొన్న చంద్రబాబు.. ఇప్పుడు వచ్చి దీక్షల పేరుతో సీఎం జగన్‌ను, ప్రభుత్వాన్ని నిందిస్తే జనాలు నమ్మే స్థితిలో లేరన్నారు. నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే.. కరోనా సంక్షోభ సమయంలో హైదరాబాద్‌లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. కరోనా ఉన్నన్ని రోజులు హైదరాబాద్‌లో కూర్చుని ఇప్పుడు వచ్చి ‘సాధన దీక్ష’ పేరుతో దొంగ దీక్షలు చేస్తారా? అని నిలదీశారు.

మరిన్ని ఇక్కడ చూడండి:పెళ్లి పందిట్లో మైక్ ఆన్ లో ఉండగ వధూవరుల ముచ్చట్లు వధూవరుల ముచ్చట్లు నెట్ లో హల్ చల్:Viral Video.

చిన్నారి నవ్వుకోసం కుక్క పిల్ల కుప్పి గంతులు..ట్రెండ్ అవుతున్న ఫన్నీ వీడియో :dog make fun viral video.

తెరపైకి ఓ క్రేజీ రోల్ లో హీరో కార్తితో ఢీ కొట్టనున్న సిమ్రాన్.. సీనియర్ నటుల బాటలో మరో హీరోయిన్ : Simran as vilan in karthi movie

బర్త్‌డే పార్టీలో సింహం చీఫ్ గెస్ట్..అదిరిపోయే ట్విస్ట్!వైరల్ అవుతున్న వీడియో :Lion as party video.