జయలలిత ఎస్టేట్‌లో, వాచ్‌మాన్‌ హత్య, దోపిడి వ్యవహారంలో మళ్లీ సంచలన విషయాలు.. వీడియో

తమిళనాడు మాజీ సీఎం జయలలిత కొడనాడ్‌ ఏస్టేట్‌ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం జరిగిన వాచ్‌మెన్‌ హత్య, దోపిడి వ్యవహారంలో ఎస్టేట్‌ మేనేజర్‌ను పోలీసులు ఇవాళ ప్రశ్నించారు.

తమిళనాడు మాజీ సీఎం జయలలిత కొడనాడ్‌ ఏస్టేట్‌ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం జరిగిన వాచ్‌మెన్‌ హత్య, దోపిడి వ్యవహారంలో ఎస్టేట్‌ మేనేజర్‌ను పోలీసులు ఇవాళ ప్రశ్నించారు. జయ బంగ్లాలో జరిగిన 20 కోట్ల విలువైన నగదు, బంగారం దోపిడీపై ఆరా తీశారు. జయకు చెందిన ఆస్తులను కాజేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఎస్టేట్‌లోకి చొరబడి కీలక పత్రాలను కాల్చేసి, బంగారం నగదు దోచుకుపోతుంటే, అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాచ్‌మాన్‌ ఓంకార్‌ను హత్య చేశారు. జయలలిత మరణం తర్వాత అప్పట్లో జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో నీలగిరి జిల్లాలోని కొడనాడ్‌లోని జయలలిత ఏస్టేట్‌లో 2017 ఏప్రిల్‌లో వాచ్‌మెన్‌ హత్యకు గురయ్యాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:Viral video: డీజేగా మారిన వధువు..! చిందులేస్తూ సందడి చేసిన పెళ్లి జంట!.. వీడియో

వైరల్‌గా రచయిత పోస్ట్‌..!! ఉబ్బితబ్బిబవుతున్న భారత అభిమాని..!! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu