హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేస్తాం.. మరోసారి స్పష్టం చేసిన బాలయ్య

హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేస్తాం.. మరోసారి స్పష్టం చేసిన బాలయ్య

Phani CH

|

Updated on: Aug 18, 2024 | 4:14 PM

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పలు ప్రాంతాలలో పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలోని హిందూ పురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అక్కడ నేతలు కోరుతున్నారు. దీంతో హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎప్పుడు నుంచో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరుతున్నారు. అప్పట్లో బాలకృష్ణ స్వయంగా నిరసనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పలు ప్రాంతాలలో పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలోని హిందూ పురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అక్కడ నేతలు కోరుతున్నారు. దీంతో హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎప్పుడు నుంచో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరుతున్నారు. అప్పట్లో బాలకృష్ణ స్వయంగా నిరసనలు తెలిపారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలంటూ పాదయాత్ర కూడా చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే హిందూపురంను జిల్లా కేంద్రంగా చేస్తామంటూ ప్రకటించారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ తన ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనేది ప్రజల చిరకాల వాంఛ అని గతంలోనే బాలయ్య చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

SSLV-D3 ప్రయోగం సక్సెస్‌.. ప్రకృతి విపత్తులపై ఇక డేగ కన్ను

Explainer: మంకీపాక్స్.. ముంచేస్తుందా ?? దీని లక్షణాలు ఏంటంటే ??

Explainer: అన్న క్యాంటీన్ మెనూ ఇదే.. ఆహార పరిమాణం ఎంతంటే ??

iSmart News: జిమ్ లో కసరత్తులు చేసిన నందమూరి నటసింహం.

500 మంది ఫైటర్లతో.. పవన్‌ పై ఫైట్ సీక్వెస్‌