అదిలాబాద్ జిల్లా బేల మండలం ఖోగ్దూర్‌లో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం తొలిసారిగా ఖోగ్దూర్ గ్రామంలో అడుగుపెట్టిన పాయల్ శంకర్‌కు గ్రామస్తులు గుర్రంతో స్వాగతం పలికారు. గుర్రంపై కూర్చోబెట్టి పూలు చల్లుతూ.. గ్రామంలో డీజే డప్పు డప్పుల మధ్య తిప్పుతూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తుల ఆదరభిమానాలు మర్చిపోలేమని.. తన హాయంలో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీనిచ్చారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెంట జిల్లా, మండల నాయకులు, పార్టీ శ్రేణులు గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీచేసిన పాయల్ శంకర్.. దాదాపు 7వేల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నపై విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..