Watch Video: ఏపీ ఎన్నికల్లో పోటీపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు..
రానున్న ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాల్లో జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. తమ పార్టీలో చేరడానికి ఎంతో మంది ఉత్సహం చూపిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వాలని చాలా మంది అడుగుతున్నారని వెల్లడించారు.
రానున్న ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాల్లో జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. తమ పార్టీలో చేరడానికి ఎంతో మంది ఉత్సహం చూపిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వాలని చాలా మంది అడుగుతున్నారని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. పెద్ద ఆశయాలతో తామ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు. అభివృద్ధి, ఉపాధి, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మేనిఫోస్టోని రూపొందిస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట, జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని ఆయన సందర్శించారు. కోనసీమను ఆధ్మాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని వీవీ లక్ష్మీనారాయణ అన్నారు.
మరికొన్ని మాసాల్లో ఆంధ్ర ప్రదేశ్‌లో జమిలి ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని లక్ష్మీనారాయణ ప్రకటించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

