Ayodhya Ram Mandir: అయోధ్య రాముని దర్శనానికి మేమూ వెళ్తాం.. వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ayodhya Ram Mandir: అయోధ్య రాముని దర్శనానికి మేమూ వెళ్తాం.. వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Janardhan Veluru

|

Updated on: Jan 17, 2024 | 1:10 PM

రాముడి మీద బీజేపీకి ప్రేమలేదని.. హిందువుల ఓట్ల మీదే వారికి ప్రేమ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు విమర్శనాస్త్రాలు సంధించారు. రాముడిని రాజకీయాల్లోకి లాగి ఓట్లు సంపాదించాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. అయోధ్యలో కట్టిన రామాలయానికి అందరం వెళ్తామన్నారు. దేవుడి మీద అందరికీ భక్తి ఉందని.. అయోధ్యలో రామ మందిరానికి కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదన్నారు.

రాముడి మీద బీజేపీకి ప్రేమలేదని.. హిందువుల ఓట్ల మీదే వారికి ప్రేమ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు విమర్శనాస్త్రాలు సంధించారు. రాముడిని రాజకీయాల్లోకి లాగి ఓట్లు సంపాదించాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. అయోధ్యలో కట్టిన రామాలయానికి అందరం వెళ్తామన్నారు. దేవుడి మీద అందరికీ భక్తి ఉందని.. అయోధ్యలో రామ మందిరానికి కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదన్నారు. అయితే ప్రధాని మోదీ పిలిచినప్పుడే అయోధ్యకు వెళ్లాలా..? అని ప్రశ్నించారు. మాకు వీలయినప్పుడే అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్తామన్నారు. కాంగ్రెస్‌ రాముడికి వ్యతిరేకమని బీజేపీ దుష్ఫ్రచారం చేస్తోందని వీహెచ్ మండిపడ్డారు

25 కోట్ల మంది పేదలను దనికులకు చేశానని మోదీ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతకంటే మించిన అబద్ధం మరొకటి లేదన్నారు. మోదీ సర్కారు కార్పోరేట్ సెక్టార్‌కే లాభం చేస్తోందని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర పెంచాలని అడిగితే ఇప్పటికి ఇవ్వలేదని విమర్శించారు. నోట్లు రద్దు చేసి..చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళను రోడ్డున పడేశారని అన్నారు.

Published on: Jan 17, 2024 01:09 PM