YS Sharmila: ఏపీ పీసీసీ కొత్త సారథిగా వైఎస్ షర్మిల.. కేవీపీ ఏమన్నారంటే..? – Watch Video
ఏపీ పీసీసీ సారథ్య పగ్గాలను వైఎస్ షర్మిలకు అప్పగించడంపై వైఎస్సార్‌కు ఆప్తమిత్రుడైన కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు. వైఎస్ షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం సబబేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధిష్ఠానం అన్నీ ఆలోచించే ఆమెను పీసీసీ చీఫ్ చేసిందన్నారు.
ఏపీ పీసీసీ సారథ్య పగ్గాలను వైఎస్ షర్మిలకు అప్పగించడంపై ధివంగత వైఎస్సార్‌కు ఆప్తమిత్రుడైన కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు. వైఎస్ షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం సబబేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధిష్ఠానం అన్నీ ఆలోచించే ఆమెను పీసీసీ చీఫ్ చేసిందన్నారు. వైఎస్ షర్మిలకు పీసీసీ సారథ్య పగ్గాలు ఇవ్వడంతో ఏపీలోని కాంగ్రెస్ కార్యకర్తల్లోనూ ఓ నూతనోత్సవం కనిపిస్తోందన్నారు. వైఎస్ షర్మిల సారథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్‌వైభవం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. పార్టీ సీనియర్లు కూడా షర్మిలకు సహకరిస్తున్నారని సంతోషం వ్యక్తంచేశారు. పీసీసీ చీఫ్‌గా షర్మిల నియామకంపై ఇంకా ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూడండి..
ఏపీలో జమిలి ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ రాష్ట్ర పీసీసీ సారథ్య పగ్గాలను షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ స్థానాలకు మరికొన్ని మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల నియామకం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.