Tej Pratap Yadav: అయోధ్యకి రాముడు రావడం లేదు.. నా కలలోకి వచ్చి చెప్పాడు: తేజ్ ప్రతాప్ యాదవ్.
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం మొత్తం ఎన్నికల స్టంట్ అని బీహార్ మంత్రి, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ సింగ్ అన్నారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 22 న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాముడు రాడని స్పష్టం చేశారు. ఈ విషయం స్వయంగా రాముడే తన కలలోకి వచ్చి చెప్పాడని వివరించారు. అయోధ్యలో ఇప్పుడు హిపోక్రసీ నెలకొందని, అలాంటి చోటుకు తాను వెళ్లబోనని చెప్పాడన్నారు. ఎన్నికలు అయిపోయాక అంతా మరిచిపోతారని వ్యాఖ్యానించినట్లు తేజ్ ప్రతాప్ తెలిపారు.
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం మొత్తం ఎన్నికల స్టంట్ అని బీహార్ మంత్రి, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ సింగ్ అన్నారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 22 న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాముడు రాడని స్పష్టం చేశారు. ఈ విషయం స్వయంగా రాముడే తన కలలోకి వచ్చి చెప్పాడని వివరించారు. అయోధ్యలో ఇప్పుడు హిపోక్రసీ నెలకొందని, అలాంటి చోటుకు తాను వెళ్లబోనని చెప్పాడన్నారు. ఎన్నికలు అయిపోయాక అంతా మరిచిపోతారని వ్యాఖ్యానించినట్లు తేజ్ ప్రతాప్ తెలిపారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావడంలేదంటూ నలుగురు శంకరాచార్యులు ఇప్పటికే ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ నలుగురు శంకరాచార్యుల కలలోకి వెళ్లి ఇదే విషయం చెప్పినట్లు రాముడు తనతో పేర్కొన్నాడన్నారు. అందుకే వారు అయోధ్యకు రావడం లేదని తేజ్ ప్రతాప్ వివరించారు. కాగా, తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలపై కానీ, అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం విషయంపై కానీ ఆయన సోదరుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఎలాంటి కామెంట్ చేయలేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..

