CM Chandrababu: ఏపీ ఉద్యోగులకు చంద్రన్న దీపావళి కానుక
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు. నవంబర్ 1న ఒక డీఏ జమ చేస్తామని తెలిపారు. పోలీసులకు రెండు విడతల్లో ఎర్న్‌డ్ లీవ్స్ చెల్లింపు, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్‌లో వయోపరిమితి తొలగింపు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీపై సానుకూలంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండగ ముందుగానే వచ్చేసింది. సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలను ప్రకటించడం ద్వారా ఉద్యోగులలో కొత్త ఉత్సాహం నిండింది. నవంబర్ 1న ఒక డీఏ (కరువు భత్యం)ను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ డీఏ కారణంగా ప్రభుత్వంపై నెలకు 160 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. పోలీసుల ఎర్న్‌డ్ లీవ్స్ చెల్లింపునకు సంబంధించి 210 కోట్ల రూపాయలను రెండు విడతల్లో అందించనున్నారు. నవంబర్‌లో 105 కోట్లు, జనవరిలో మరో 105 కోట్లు చెల్లిస్తామని సీఎం తెలిపారు. ఆర్థిక వెసులుబాటు లభిస్తే పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) కూడా అమలు చేస్తామని ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున
TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్ లోకేష్ కాంబినేషన్‌లో సినిమా..?
నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్
బంగారం కొంటున్నారా? నకిలీ గోల్డ్‌ని గుర్తించండిలా
అప్పుడు కల్యాణానికి వజ్రాల తలంబ్రాలు.. కట్ చేస్తే ఇప్పుడు వేట
ఒంట్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలని.. కోడలితో బలవంతంగా
ఫ్రైడ్ రైస్‌లో బొద్దింకషాకైన కస్టమర్లు
సెంట్రల్ జైల్లో ఖైదీల రాజభోగాలు..!
కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..
అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

