Etela Rajender: అవసరానికి వాడుకుని వదిలేశారు.. తుమ్మలను బీజేపీలోకి ఆహ్వానిస్తాం.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు..

|

Aug 27, 2023 | 2:07 PM

Etela Rajender on Tummala Nageswara Rao: మాజీ మంత్రి, BRS నేత తుమ్మల నాగేశ్వరరావు విషయంలో బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తుమ్మలను బీజేపీలోకి ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. పాలేరు బీఆర్ఎస్ టికెట్ దక్కని తుమ్మలను కలిసి ఈ విషయాన్ని చర్చిస్తామన్నారు..

Etela Rajender on Tummala Nageswara Rao: మాజీ మంత్రి, BRS నేత తుమ్మల నాగేశ్వరరావు విషయంలో బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తుమ్మలను బీజేపీలోకి ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. పాలేరు బీఆర్ఎస్ టికెట్ దక్కని తుమ్మలను కలిసి ఈ విషయాన్ని చర్చిస్తామన్నారు.. తుమ్మలను అవసరానికి వాడుకుని వదిలేశారని.. ఆయన్ను BJPలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈటల వర్షన్ ఇలా ఉంటే.. తుమ్మల అనుచరులు మాత్రం కాంగ్రెస్‌లో చేరాలంటూ ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఖమ్మం ర్యాలీ తర్వాత సైలెంట్‌ అయ్యారు తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్‌ పిలుపు కోసం 15 రోజులపాటు వేచి చూసి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించినట్లు తెలుస్తుంది. ఏదిఏమైనా తాను మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరతానని.. ఎన్నికల్లో తిరిగి నిలబడతానని రెండు రోజుల క్రితం నిర్వహించిన ర్యాలీలో తుమ్మల ప్రకటించారు.

తుమ్మల లాంటి వాళ్లు వస్తే ఖమ్మంలో బలపడతామని BJP లెక్కేస్తుంటే.. కాంగ్రెస్‌ కూడా అదే ఆలోచనలో ఉంది. పార్టీ మారేట్టయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.. పాలేరు కోసమే పట్టుబడితే ఈక్వేషన్లు ఎలా మారతాయి అనేదానిపై త్వరలో స్పష్టత రానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..