Pawan Kalyan: తనను కలిసేందుకు వచ్చేవారికి పవన్ కల్యాణ్ స్పెషల్ రిక్వెస్ట్…
తనను కలవడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని పవన్ విజ్ఞప్తి చేశారు. వాటికి బదులు పేదలకు సాయపడేవి ఏవైనా తీసుకురావాలని సూచించారు. ఆయనేమన్నారో వీడియోలో విందాం పదండి....
సినిమాల్లో మాత్రమే కాదు.. రాజకీయాల్లోనూ తన మార్క్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇప్పటికే పిఠాపురంలో అధికారుల పనితీరుపై సర్వే చేయించాలని నిర్ణయించి సంచలనం క్రియేట్ చేశారు. తాజాగా వారెవ్వా అనిపించేలా ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చేవారు.. విగ్రహాలు, బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని రిక్వెస్ట్ చేశారు. వాటికి బదులుగా ప్రజలకు ఉపయోగపడేవి తేవాలని సూచించారు. బొకేలు, శాలువాలకు బదులు కూరగాయలు వంటివి తీసుకువస్తే అనాథ శరణాలయాలకు ఇవ్వొచ్చన్నారు పవన్. విగ్రహాలు, శాలువాలు ఖర్చు చేసే డబ్బును టోకెన్ కింద ఇస్తే.. అన్నా క్యాంటీన్లకు వినియోగించవచ్చని చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను కలవడానికి వచ్చిన సమయంలో.. బొకేకు బదులుగా కూరగాయల బుట్టను బహూకరించారు జనసేన ఎంపీలు. ఈ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన ఎంపీలు బాలశౌరి, ఉదయ్‌లను పవన్ కల్యాణ్ అభినందించారు.
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

