Telangana: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లోకి  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే

Telangana: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లోకి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే

Ram Naramaneni

|

Updated on: Jul 13, 2024 | 11:56 AM

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు స్పీడప్‌ చేసింది. శుక్రవారం రాజేంద్రనగర్‌ MLA ప్రకాష్‌గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరితే, శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అధికారపార్టీకి జై కొట్టారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు.

బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు కార్పోరేటర్లు, స్థానిక నాయకులు, అనుచరులు కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి తనకు పాత మిత్రుడే అన్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ముఖ్యమంత్రే స్వయంగా తనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్టు చెప్పుకొచ్చారు. అన్నీ ఆలోచించిన తర్వాత… కార్యకర్తలు, శ్రేయోభిలాషుల సూచన మేరకు కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు అరికెపూడి.

ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా గాంధీ చేరికతో.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..