PM Modi: ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం.. త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు భారత సాయుధ దళాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో, త్రివిధ దళాల నాయకులు ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధానమంత్రికి వివరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత విచ్ఛిన్నమైన పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేస్తోంది. ఆ వివరాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటికి త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. త్రివిధ దళాల నాయకులు ఆపరేషన్ సింధూర్, భారత సరిహద్దుల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రధాని మోదీకి వివరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్.. భారత సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. ఈ దాడులను మూడు భారత సాయుధ దళాల సైనికులు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది. పలు సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ ప్రకటించింది కేంద్రం. మొత్తం పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశ సరిహద్దు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను ప్రధాని మోదీ నిశితంగా గమనిస్తున్నారు. దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

