ఈరోజు వన్ బీహెచ్ కేలో ప్రయాణిస్తున్నానని ఆ కస్టమర్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. అబ్దుల్ ఖదీర్ ఉబర్ డ్రైవర్ గా తన కారును రోడ్డుపైకి తీసుకెళ్తున్నప్పుడు ప్రయాణికులకు బోర్ కొట్టడం అనేదే ఉండదు. స్నాక్స్, బొమ్మలు, మెడిసిన్స్ ఇలా అన్ని అతని కాబ్ లో అమర్చాడు. పెద్దలకి, పిల్లలకి అవసరమైన వస్తువుల్ని అందుబాటులో ఉంచాడు. కాబ్ లో ప్రయాణించిన వారంతా ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఇస్తున్నారు. వైఫై, మందులు, స్నాక్స్, ఇంకా బొమ్మలు ఇలా అతని వద్ద అన్ని ఉన్నాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో నెటిజెన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. ఒక నెటిజెన్ ఆ కాబ్ లో తన ప్రయాణ అనుభవాన్ని షేర్ చేశాడు. అదే ఉబర్ లో ప్రయాణించాను సూపర్ కూల్ అని రాసుకొచ్చాడు. అబ్దుల్ ఖదీర్ సాధారణ డ్రైవర్ కంటే ఎక్కువ సంపాదించకపోవచ్చు కానీ ఈ సౌకర్యాలన్నీ వాస్తవానికి కనీసం పది మందిలో ఒకరికి సహాయపడతాయని మరొకరు పోస్ట్ పెట్టారు.
వావ్ ఈ ఉబర్ క్యాబ్ లో స్నాక్స్ మాత్రమే కాదండయో.. వీడియో
సాధారణంగా కాబ్ అంటే మనం చేరల్సిన చోట దింపేసి చార్జ్ తీసుకొని వెళ్ళిపోయే డ్రైవర్ మాత్రమే తెలుసు. కానీ ఉబర్ డ్రైవర్ అబ్దుల్ ఖదీర్ స్పెషాలిటీ వేరు. ఆ కాబ్ లో ప్రయాణించిన ఎవరికైనా ఆ ట్రిప్ జీవితాంతం గుర్తుండిపోవాల్సిందే. అబ్దుల్ ఖదీర్ తన కాబ్ లోని సౌకర్యాల కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. స్నాక్స్ నుండి బొమ్మల వరకు అతని కాబ్ లో కనిపిస్తాయి. ఓ కస్టమర్ అబ్దుల్ కాబ్ లోపలి దృశ్యాన్ని షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది.
వైరల్ వీడియోలు
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
