బైకులో పెట్రోలు పోస్తుండగా ఎగసిపడిన మంటలు వీడియో
ఓ యువకుడికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. యువకుడికే కాదు. ఆ చుట్టుపక్కల అనేకమందికి ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ యువకుడు పెట్రోలుకొట్టించుకుంటుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దాంతో అక్కడున్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యువకుడు అలర్ట్ అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోనీ పెట్రోల్ బంకులో పెట్రోలు కొట్టించుకునేందుకు ఓ యువకుడు తన బైక్‌తో వచ్చాడు. పెట్రోలు పంప్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందికి పెట్రోలు కొట్టాల్సిందిగా చెప్పాడు. అతను పైపు తీసుకొని యువకుడి బైకులో పెట్రోలు పోస్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా పెట్రోలు పైపునుంచి మంటలు చెలరేగాయి. ఒక్క క్షణం ఇద్దరూ షాకయ్యారు. పెట్రోలు పోస్తున్న యువకుడు అక్కడినుంచి దూరంగా వెళ్లిపోయాడు. వాహనదారుడు అలర్టయి పైపును తీసి కిందపడేశాడు. ఇంతలో అక్కడే ఉన్న మరో వ్యక్తి పరుగెత్తుకొచ్చి మంటలు వ్యాపించకుండా ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది ఈ పాముకి వీడియో
ఏఐ మ్యాజిక్.. డ్రోన్స్, రోబోలతో సిరుల సేద్యం వీడియో
ఏమి మారిందంటూ..పాటతో రైతు కష్టాలు చెప్పిన కూరగాయలమ్మే వ్యక్తి వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
