Watch Video: ఎన్నికల్లో విజయం కోసం అభిమానుల ఆరాటం.. మరీ ఇంత పిచ్చేంట్రా బాబు..
దేశ వ్యాప్తంగా మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఆ క్రమంలోనే తమ అభిమాన నాయకులు గెలవాలంటూ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయం సాధించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కారు. అలాగే కూటమి అధికారంలోకి రావాలని తిరుమలలో మరో అభిమాని పొర్లు దండాలు పెట్టాడు.
దేశ వ్యాప్తంగా మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఆ క్రమంలోనే తమ అభిమాన నాయకులు గెలవాలంటూ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయం సాధించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కారు. అలాగే కూటమి అధికారంలోకి రావాలని తిరుమలలో మరో అభిమాని పొర్లు దండాలు పెట్టాడు. ఇలా తమ అభిమాన హీరో కోసం కొందరు, నాయకుల కోసం మరికొందరు విన్నూత్న రీతిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవాలని దేవుడిని ఆరాధిస్తున్నారు. అటు అల్లూరి జిల్లాలోనూ వైసీపీ గెలవాలని మన్యం నేతలు గండి పోచమ్మ సన్నిధిలో కుంకుమ పూజ చేశారు. జగన్ మళ్లీ సీఎం కావాలంటూ గుడిలో వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టారు. పండితులతో జగన్ పేరుపై గండి పోచమ్మ అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేయించారు మన్యం వైసీపీ నేతలు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తి భావనను ప్రదర్శించుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

