Nikhil Kamath: ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..

Nikhil Kamath: ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..

Ravi Kiran

|

Updated on: Jul 28, 2024 | 5:08 PM

ప్రధాన మోదీ నుంచి తాము నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అన్నారు. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌తో చేసిన పోడ్‌కాస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి కృషి, నిరంతర పనితీరుపై కామత్ ప్రశంసలు కురిపించారు.

ప్రధాన మోదీ నుంచి తాము నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అన్నారు. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌తో చేసిన పోడ్‌కాస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి కృషి, నిరంతర పనితీరుపై కామత్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీని అత్యంత సన్నిహితంగా చూడటం, కలుసుకోవడాన్ని అదృష్టంగా భావిస్తానన్నారు కామత్. ప్రతీ ఒక్కరం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. అలాగే యూఎస్ మీట్‌అప్ కవరింగ్‌లో ప్రధాని మోదీతో తనకు కలిగిన అనుభవాన్ని పంచుకున్నారు నిఖిల్ కామత్.

“ఒకసారి మేము యూఎస్‌లో ఉన్నాం. ముగ్గురు లేదా నలుగురితో కూడిన మా బృందం ప్రధాని మోదీతో కలిసి యూఎస్‌లో ఉన్నాం. ఇది దాదాపు ఒక సంవత్సరం క్రితం జరిగిన సంఘటన. అప్పుడు మేము 3 నుంచి 4 రోజులు వాషింగ్టన్‌లో ఉన్నాం. ఆయన ఉదయం 8 గంటలకు అమెరికన్ వ్యాపారవేత్తలతో బిజినెస్ మీటింగ్ చేశారు. ఆ తర్వాత 11 గంటలకు వేరే చోట ప్రసంగం ఇచ్చారు. ఆపై మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ఉపరాష్ట్రపతితో చర్చ సాగించారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు వేరే మీటింగ్, రాత్రి 7 గంటలకు మరొకటి, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ఇంకోటి.. అలాగే రాత్రి 11 గంటలకు కూడా ఇంకేదో సమావేశం ఉంది’. అని పోడ్‌కాస్ట్‌లో కామత్ చెప్పుకొచ్చాడు.

‘ఇన్ని సమావేశాలకు అటెండ్ అయినా ఆయన ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నారని.. కేవలం రెండు రోజులకు తాను అలిసిపోయానని నిఖిల్ కామత్ అన్నారు. యూఎస్‌లో ఈ సుదీర్ఘ మీటింగ్స్ అనంతరం వెంటనే ప్రధాని మోదీ ఈజిప్ట్ పయనమయ్యారు,’ అని కామత్ పేర్కొన్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..