Visakhapatnam Road Accident: విశాఖపట్నంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని సంగం-శరత్ థియేటర్ దగ్గర లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్ధులకు తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషంగా ఉంది. రోడ్డు దాటే క్రమంలో ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. స్కూల్ విద్యార్ధుల ప్రాణాల మీదకు తెచ్చింది. జంక్షన్‌లో స్పీడ్‌గా వస్తున్న లారీని గమనించకుండా.. వేగంగా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు ఆటో డ్రైవర్. దీంతో ఆటో వెళ్లి లారీని ఢీకొని పల్టీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 8 మంది విద్యార్ధులు ఉన్నారు. రోడ్డుపక్కన ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ప్రమాదం దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సమయం దాటిన తర్వాత లారీ రోడ్డుపైకి రావడం నిబంధన ఉల్లంఘన కాగా..ఆటో డ్రైవర్ వేగం కూడా ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. ప్రమాదం దృశ్యాలు చాలా హృదయవిదారకంగా ఉన్నాయి. రక్తం కారుతున్న గాయాలతో పిల్లలు బోరున ఏడుస్తూ రోడ్డుపై పడి ఉండటం చూసిన వారి హృదాయాలు చలించిపోయాయి.. ఈ ప్రమాదంలో ఆరుగురు పిల్లలు గాయపడ్డారు.
కాగా.. ఈ ఘటనపై డీసీపీ శ్రీనివాసరావు మాట్లాడారు. డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. 4 విద్యార్థులకు గాయాలయ్యాయని.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఆటోలో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నారని.. ఇది కూడా ప్రమాదానికి కారణమైందని శ్రీనివాసరావు తెలిపారు. ఆటోలో పిల్లలను పంపే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని.. చివరి నిమిషంలో వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని డీసీపీ వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..