తనను ప్రలోభపెట్టాలని చూశారంటూ డబ్బు కట్టలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మాజీ కౌన్సిలర్
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తనను పార్టీ మారాలని కోరారని చెప్తూ భువనగిరి మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ పొలిశెట్టి అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడితే తనకు ముప్పై లక్షల రూపాయలు ఇస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖరరెడ్డి ప్రలోభపెట్టారని మాజీ కౌన్సిలర్ పొలిశెట్టి అనిల్ ఆరోపించారు.
మరో వారంలో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖరరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తనను పార్టీ మారాలని కోరారని చెప్తూ భువనగిరి మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ పొలిశెట్టి అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడితే తనకు ముప్పై లక్షల రూపాయలు ఇస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖరరెడ్డి ప్రలోభపెట్టారని మాజీ కౌన్సిలర్ పొలిశెట్టి అనిల్ ఆరోపించారు.
అంతే కాదు ముందుగా తనకు ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా పంపారని ఆ నోట్ల కట్టలను మీడియా ముందు ప్రదర్శించారు. బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్న తర్వాత మిగిలిన 25 లక్షల ఇస్తానని తనకు మాట ఇచ్చారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చారని చెప్తున్న నగదుతో పొలిశెట్టి అనిల్ భువనగరి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై భువనగరి పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..