ఆక్రమ దందాకు అనేక మార్గాలు అన్నట్లు జార్ఖండ్‌కి చెందిన ఇద్దరు మద్యం వ్యాపారులు భలే పని చేశారు. తన మద్యం రవాణా కోసం ఏకంగా అంబులెన్స్‌నే వాడేశారు. అయితే దొంగ ఎప్పటికైనా దొరకాల్సిందే కదా.. కాలం కలిసి రాక ఎక్సైజ్ శాఖ అధికారుల చేతులకు చిక్కారు. అంబులెన్స్‌లో శవపేటికలో దాచిపెట్టి జార్ఖండ్ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బీహార్‌లోని గయాలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. నిందితులు రాంచీకి చెందిన లలిత్ కుమార్ మహ్తో, జార్ఖండ్‌లోని చత్రా జిల్లాకు చెందిన పంకజ్ కుమార్ యాదవ్ గా గుర్తించారు. మద్యం అక్రమ రవాణా కోసం అంబులెన్స్‌లో శవపేటికను ఉంచారు. మృతదేహానికి బదులుగా మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు గుర్తించింది ఎక్సైజ్ సిబ్బంది. వివిధ బ్రాండ్లకు చెందిన 212 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గయా జిల్లాలోని దోభి చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ బండారం బయటపడింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..