Kurnool bus tragedy: కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్
కర్నూలు బస్సు ప్రమాదంలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. V కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం కన్నా ముందే శివశంకర్ మృతి చెందినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. అలాగే, ఈ ప్రమాదం వెనక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని పోలీసులు స్పష్టమైన అవగాహనకు వచ్చారు. కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం కంటే ముందే మద్యం సేవించిన శివశంకర్ బైక్ పై వేగంగా బైక్‌పై వెళ్లి స్కిడ్ అయ్యి రోడ్డుమీద పడి చనిపోయినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో అతని బైక్ అలాగే హైవే మీద అడ్డంగా పడిపోయింది. ఆ తర్వాత.. అడ్డంగా పడిన ఆ బైకును తప్పించుకుంటూనే మరో 19 వాహనాలు ఆ మార్గంలో వెళ్లాయని, ఆ తర్వాత వీ.కావేరీ ట్రావెట్ బస్సు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వేగంగా వచ్చిన వీ కావేరీ ట్రావెల్స్ బస్సు.. రోడ్డుమీద అడ్డంగా పడిన బైక్‌ను గమనించక నేరుగా దాని ఎక్కేసింది. ఈ క్రమంలో బైక్ ను 300 మీటర్లు బైకును ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో బైక్ ఇంజన్, రోడ్డుకు మధ్య రాపిడి జరిగి.. నిప్పురవ్వలు చెలరేగటం, అదే టైంలో బైక్ క్యాప్ ఊడిపడి పెట్రోల్ లీక్ కావటంతో మంటలు అంటుకున్నాయి. అయితే..మంటలను గమనించిన డ్రైవర్ లక్ష్మయ్య.. మంటలు విస్తరించే వరకు తన దగ్గరున్న నీళ్ల బాటిల్‌తో మంటలార్పే ప్రయత్నం చేశాడు. కాని.. మంటలు ఎగసిపడడంతో బస్సు దిగి పారిపోయాడు. దీంతో బస్సులోని 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ కేసులో A-1 గా డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య పేరును చేర్చారు. A-2 గా వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం ఉంది. ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమాని. ఇంత ఘోరం జరిగినా.. ఇంకా బస్సు యజమానిని పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లివ్ ఇన్ పార్ట్‌నర్‌ను చంపి.. నెయ్యి, వైన్ పోసి తగులబెట్టింది
క్యాన్సర్ రోగుల కోసం కదిలిన ఒడిశా కేశదాత హరప్రియ
వీధి కుక్కల ఆకలి తీర్చి.. సొంత ఖర్చుతో వ్యాక్సిన్లు వేయిస్తున్న ఒడిశా వాసి
కొద్ది గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం.. ఏం జరిగిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

