AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఈ దున్నపోతు ధర రూ.23 కోట్లట !! ఈ గుర్రం ధర రూ.15 కోట్లట

వామ్మో.. ఈ దున్నపోతు ధర రూ.23 కోట్లట !! ఈ గుర్రం ధర రూ.15 కోట్లట

Phani CH
|

Updated on: Oct 29, 2025 | 4:31 PM

Share

ఏటా రాజస్థాన్ లో పుష్కర్ ఫెయిర్‌ పేరుతో పశువుల సంత నిర్వహిస్తారు. ఈ సంతలో రకరకాల జంతువులను రైతులు ప్రదర్శిస్తారు. ఒంటెలు, గుర్రాలు, గేదెలను ప్రదర్శనలో ఉంచుతారు. ఈ పుష్కర ఫెయిర్‌ ప్రదర్శనకు దేశం నలుమూలల నుంచి రైతులు ఖరీదైన పశువులను తీసుకొస్తారు. ఈ ఏడాది కూడా రకరకాల జంతువులు ప్రదర్శనకు వచ్చాయి. వీటిలో ఓ గుర్రం, ఓ గేదె ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అందుకు కారణం వాటి ధరే. ఈ పుష్కర్‌లో ఓ గుర్రం ఏకంగా ధర రూ.15 కోట్లు పలికితే.. ఆశ్చర్యకరంగా ఓ దున్నపోతు రూ.23 కోట్ల ధర పలికింది. చండీగఢ్ రైతు తీసుకొచ్చిన గుర్రం ‘షాబాజ్’ కు ఏకంగా రూ.15 కోట్లు.. రాజస్థాన్ కు చెందిన రైతు తీసుకువచ్చిన దున్నపోతు ‘అన్మోల్’ ధర రూ.23 కోట్లు ధర పలికాయని నిర్వాహకులు తెలిపారు. రెండున్నరేళ్ల వయసున్న షాబాజ్ గుర్రం ఈ ప్రదర్శనలో అనేక బహుమతులు గెలుచుకుంది. ఈ గుర్రాన్ని విక్రయానికి ఉంచిన రైతు దాని ధరను రూ.15 కోట్లుగా ప్రకటించారు. కొనుగోలుదారులు రూ.9 కోట్ల వరకూ ఇచ్చేందుకు సిద్ధపడ్డారట. ఆ ధరకు తాను గుర్రాన్ని ఇచ్చేదే లేదని రైతు స్పష్టం చేశాడు. ఈ గుర్రం బ్రీడ్ కు రూ.2 లక్షల ధర పలుకుతోందట. ఇక ఈ పశువుల ప్రదర్శనలో ఆకట్టుకున్న మరో పశువు అన్మోల్ దున్నపోతు. ఈ ప్రదర్శనలో ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఈ దున్నకు రోజూ పాలు, నెయ్యితో పాటు డ్రైఫ్రూట్స్ పెట్టి పెంచుతున్నట్లు రైతు చెప్పారు. దీనిని రూ.23 కోట్లకు అమ్మకానికి పెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kurnool bus tragedy: కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్

లివ్ ఇన్ పార్ట్‌నర్‌ను చంపి.. నెయ్యి, వైన్ పోసి తగులబెట్టింది

క్యాన్సర్ రోగుల కోసం కదిలిన ఒడిశా కేశదాత హరప్రియ

వీధి కుక్కల ఆకలి తీర్చి.. సొంత ఖర్చుతో వ్యాక్సిన్లు వేయిస్తున్న ఒడిశా వాసి

కొద్ది గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం.. ఏం జరిగిందంటే..