కొద్ది గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం.. ఏం జరిగిందంటే..
పంజాబ్ రాష్ట్రం ఫరీద్‌కోట్ జిల్లా బర్గారి గ్రామంలోని పూజ అనే అమ్మాయి, పక్క గ్రామం రౌకేకి చెందిన ఓ యువకుడిని ఇష్టపడింది. అతను దుబాయ్‌లో పనిచేస్తాడు. అయితే తమ బిడ్డ ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి చేయడానికి పూజ కుటుంబం సిద్ధమైంది. ఇరుకుటుంబాల అంగీకారంతో, వధూవరుల నిశ్చితార్దం వీడియో కాల్ ద్వారా జరిగింది. తరువాత ఇరుకుటుంబాలు అక్టోబర్ 24న ధూమ్ ధామ్‌గా పెళ్లి చేయాలని నిర్ణయించాయి.
పెళ్లికి కొన్ని రోజుల ముందు దుబాయ్ నుంచి పెళ్లికుమారుడు వచ్చాడు. ఇరుకుటుంబాల వారు సంతోషంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహానికి ఒక రోజు ముందు, అంటే అక్టోబర్ 23న అమ్మాయి కుటుంబం జాగరన్ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో పెళ్లి కూతురు చాలా ఉత్సాహంగా భాంగ్రా డాన్స్ చేసింది. ఎంతో చక్కగా గిద్ద ప్రదర్శించింది. అంతేకాదు తన కుటుంబ సభ్యులతోనూ డాన్స్ చేయించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి ముక్కు నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. దీంతో ఆమెను వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె గుండెపోటుతో మరణించిందని వైద్యుడు చెప్పాడు. దీంతో వధూవరుల కుటుంబాలతోపాటు, గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. వివాహానికి ఒక రోజు ముందు పెళ్లికూతురు మరణించడంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో, చావు డప్పులు మోగాయి. నేటి రోజుల్లో వేడుక ఏదైనా డీజే పాటలు మాత్రం తప్పనిసరి అయ్యాయి. చెవులు చిల్లలు పడేలా శబ్దం గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు డీజేలకు రాత్రి 10 గంటల తర్వాత అనుమతి ఇవ్వడం లేదు. కానీ కొంత మంది అనధికారికంగా అర్ధరాత్రి వరకు వాటిని వినియోగిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నవంబరు 1 నుంచి మారనున్న ఆధార్ రూల్స్
కాలజ్ఞాన మహిమ.. నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపుంజు
రజనీ-కమల్ కాంబోలో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన సౌందర్య, శ్రుతి
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

