తండ్రి ప్రేమ అంటే ఇదే.. కూతురి కోసం తపన పడ్డ రైతు ..
కూతురి కళ్లల్లో సంతోషం చూడటం కోసం ఓ సామాన్య రైతు.. ఆమెకు జీవితాంతం గుర్తుండే బహుమతి ఇచ్చాడు. తండ్రి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ రైతు వీడియో చూపరులను కదిలిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని కేస్రా గ్రామానికి చెందిన బజ్‌రంగ్ ఓ సామాన్య రైతు. తన కూతురు చంపాకు స్కూటీని బహుమతిగా ఇద్దామని భావించాడు. ఇందుకోసం అతడు ఆరు నెలల పాటు కష్టపడి డబ్బు కూడబెట్టాడు.
తన కూతురు, భార్యతో కలిసి ఓ బ్యాగు నిండా డబ్బులు తీసుకుని స్థానిక షోరూమ్‌కు వెళ్లాడు. తన కూతురికి బహుమతిగా స్కూటీ కొనాలని అనుకుంటున్నట్టు సిబ్బందితో చెప్పాడు. స్కూటీకి చెల్లించాల్సిన మొత్తం 98 వేల 700 రూపాయలు. తనకు లోన్ తీసుకోవడం ఇష్టం లేదనీ తెలిపాడు. కొంత మొత్తాన్ని 10 రూపాయల నాణేల రూపంలో తెచ్చాడు. ఈ నాణేలను తీసుకుంటారా? అని షోరూమ్ సిబ్బందిని సంకోచిస్తూనే అడిగాడు. బజ్‌రంగ్ తండ్రి మనసును అర్థం చేసుకున్న షోరూమ్ ఓనర్ ఆనంద్ గుప్తా వెంటనే అతడి అభ్యర్థనను అంగీకరించాడు. నాణేలను లెక్కించాలని సిబ్బందిని పురమాయించాడు. ఈ క్రమంలో రూ.40 వేలను నాణేలుగా చెల్లించిన బజ్‌రంగ్ మిగతా మొత్తాన్ని కరెన్సీ నోట్ల కింద చెల్లించి స్కూటీని బహుమతిగా ఇచ్చాడు. పది రూపాయల నాణేలను లెక్కించడానికి సిబ్బందికి 3 గంటలు పట్టింది. స్కూటీ సొంతమైనందుకు సంతోషపడుతున్న కూతురిని చూసి అతడు మరింతగా సంబరపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొద్ది గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం.. ఏం జరిగిందంటే..
నవంబరు 1 నుంచి మారనున్న ఆధార్ రూల్స్
కాలజ్ఞాన మహిమ.. నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపుంజు
రజనీ-కమల్ కాంబోలో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన సౌందర్య, శ్రుతి
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

