రజనీ-కమల్ కాంబోలో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన సౌందర్య, శ్రుతి
రజినీకాత్-కమల్‌హసన్ కాంబోలో మూవీ అంటే అభిమానులకు పండగే. 1970ల్లో వీరిరువురి కాంబినేషన్‌లో పలు హిట్ చిత్రాలు పడ్డాయి. ఈ స్టార్ హీరోలిద్దరూ కలిసి నటిస్తే చూడాలని అటు తమిళ అభిమానులు, ఇటు తెలుగు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరి ఎదురుచూపులకు త్వరలో తెరదించబోతున్నారు ఈ అగ్రహీరోలు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా పక్కా అంటూ క్లారిటీ ఇచ్చేశారు రజినీ కుమార్తె సౌందర్య, కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్.
సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రాబోతోందనే వార్త చాలాకాలంగా చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఈ వార్తపై అధికారిక సమాచారం బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి దర్శకుడు ఎవరు, సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుంది అనే వివరాలు బయటకు రాలేదు. మొదట్లో ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ప్రదీప్ రంగనాథన్ పేరు వినిపించింది. కానీ తాను ఈ ప్రాజెక్ట్‌లో లేనని ప్రదీప్ స్పష్టం చేయడంతో.. అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్, కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ చెన్నైలో జరిగిన ఒక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. వారిరువురూ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందని ధృవీకరించారు. రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో సినిమా తప్పకుండా తెరకెక్కుతుందని, ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించబోతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని తెలిపారు. ఇటీవల సైమా అవార్డుల వేడుకలో కమల్ హాసన్ కూడా ఈ విషయం గురించి స్పందించారు. తామిద్దరం కలిసి నటించాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నామని, ప్రేక్షకులు తమ కాంబినేషన్ చూసి సంతోషిస్తే తమకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాతిక చిత్రాల కౌంట్ తో దూసుకుపోతున్న రష్మిక
ఫస్ట్ అటెంప్ట్ తో ఆకట్టుకుంటున్న కెప్టెన్స్
నిఖిల్ స్వయంభు ఆలస్యానికి కారణం ఏంటి..?
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

