కోల్‌కతా కేసు నిందితుడు సంజయ్‌ రాయ్‌.. జైల్లో ఎగ్‌ నూడుల్స్‌ కావాలని డిమాండ్

కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కరెక్షనల్‌ హోమ్‌ జైలులో విచారణ ఖైదీగా ఉన్న కోల్‌కతా హత్యాచార ఘటన ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ తన గొంతెమ్మ కోరికలతో అధికారులను విసిగిస్తున్నాడు. వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటనపై యావద్దేశం మండుతున్నప్పటికీ జైలులో తనకు రాచమర్యాదలు కావాలంటూ చాలా ఓవర్ చేస్తున్నాడు. మిగతా ఖైదీలకు అందించే భోజనమే తనకు ఎలా ఇస్తారంటూ అధికారులతో వాదిస్తున్నాడు.

కోల్‌కతా కేసు నిందితుడు సంజయ్‌ రాయ్‌.. జైల్లో ఎగ్‌ నూడుల్స్‌ కావాలని డిమాండ్

|

Updated on: Sep 05, 2024 | 10:09 PM

కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కరెక్షనల్‌ హోమ్‌ జైలులో విచారణ ఖైదీగా ఉన్న కోల్‌కతా హత్యాచార ఘటన ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ తన గొంతెమ్మ కోరికలతో అధికారులను విసిగిస్తున్నాడు. వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటనపై యావద్దేశం మండుతున్నప్పటికీ జైలులో తనకు రాచమర్యాదలు కావాలంటూ చాలా ఓవర్ చేస్తున్నాడు. మిగతా ఖైదీలకు అందించే భోజనమే తనకు ఎలా ఇస్తారంటూ అధికారులతో వాదిస్తున్నాడు. అందరికీ వడ్డించినట్లే అతడికీ జైలులో రోటీ, సబ్జీ వడ్డించామని, తనకు ఎగ్‌ నూడుల్స్‌ కావాలని నిందితుడు డిమాండ్‌ చేసినట్లు జైలు వర్గాలు తెలిపాయి. సంజయ్‌రాయ్‌ ఓవరాక్షన్‌ని చూసి జైలు సిబ్బంది మందలించగా చివరకు వడ్డించిన పదార్థాలు తినడం అలవాటు చేసుకున్నాడని చెప్పాయి. జైలుకు తరలించిన ప్రారంభంలో పగలు కూడా తాను నిద్రపోయేందుకు అనుమతించాలని అడిగేవాడని, తనలో తాను మాట్లాడుకునేవాడని, కొన్ని రోజులకు సాధారణ జీవనశైలికి వచ్చేశాడని జైలు వర్గాలు తెలిపాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి.. ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసులు.. చివరకు ??

30 కిలోమీటర్ల వెంటాడి విద్యార్థి కాల్చివేత.. ఏం జరిగిందంటే ??

67 మంది ప్రాణాలు కాపాడారు.. కానీ తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు

Saripodhaa Sanivaaram: రూ.100 కోట్ల దిశగా ‘సరిపోదా శనివారం’

దృష్టి మరల్చి.. భలే చోరీ చేస్తారు.. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇదే పని

Follow us