ఆ తల్లి సాహసం ముందు.. తోడేలే తోక ముడిచింది..
ఉత్తరప్రదేశ్ లోని బహ్రయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోన్న నేపథ్యంలో.. ఓ తల్లి వీరోచితంగా పోరాడి తన కుమారుడిని కాపాడుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. హర్ది ప్రాంతంలో ఐదేళ్ల పరాస్ తన తల్లి గుడియా పక్కన ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున వింతైన శబ్దం విని ఆ తల్లి ఒక్కసారిగా మేల్కొంది. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా భయంకరమైన దృశ్యం కనిపించింది.
ఉత్తరప్రదేశ్ లోని బహ్రయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోన్న నేపథ్యంలో.. ఓ తల్లి వీరోచితంగా పోరాడి తన కుమారుడిని కాపాడుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. హర్ది ప్రాంతంలో ఐదేళ్ల పరాస్ తన తల్లి గుడియా పక్కన ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున వింతైన శబ్దం విని ఆ తల్లి ఒక్కసారిగా మేల్కొంది. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా భయంకరమైన దృశ్యం కనిపించింది. తన కుమారుడి మెడ పట్టుకుని తోడేలు లాక్కెళ్తోంది. దీంతో ఆ తల్లి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. మంచంపై నుంచి దూకి తోడేలు వైపు దూసుకెళ్లింది. ఏ మాత్రం భయపడకుండా.. ఆ జంతువు మెడ చుట్టూ రెండు చేతులు గట్టిగా బిగించింది. వెంటనే ఇతరుల సహాయం కోసం కేకలు వేసింది. దీంతో తోడేలు ఆ చిన్నారిని వదిలి అక్కడి నుంచి పరారైంది. ఆ వెంటనే తన కుమారుడి పరిస్థితిని పరిశీలించింది. తోడేలు దాడిలో గాయపడిన ఆ బాలుడిని కుటుంబసభ్యులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోల్‌కతా కేసు నిందితుడు సంజయ్ రాయ్.. జైల్లో ఎగ్ నూడుల్స్ కావాలని డిమాండ్
వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి.. ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసులు.. చివరకు ??
30 కిలోమీటర్ల వెంటాడి విద్యార్థి కాల్చివేత.. ఏం జరిగిందంటే ??
67 మంది ప్రాణాలు కాపాడారు.. కానీ తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

