పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే
పెరుగు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో క్యాల్షియం, ప్రొటీన్, విటమిన్ బి12 ఉంటాయి. మరోవైపు పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థతోపాటు ఎముకలు కూడా బలపడతాయి. చాలా మంది పెరుగులో చక్కెర కలిపి తినడానికి ఇష్టపడతారు. అయితే పెరుగులో పంచదార కలిపితే మీ ఆరోగ్యానికి హాని కలుగుతుందని, అనేక వ్యాధుల ముప్పు పెరుగుతుందని మీకు తెలుసా? పెరుగులో సహజమైన తీపి ఉంటుంది, ఇది శరీరానికి మేలు చేస్తుంది.
పెరుగు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో క్యాల్షియం, ప్రొటీన్, విటమిన్ బి12 ఉంటాయి. మరోవైపు పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థతోపాటు ఎముకలు కూడా బలపడతాయి. చాలా మంది పెరుగులో చక్కెర కలిపి తినడానికి ఇష్టపడతారు. అయితే పెరుగులో పంచదార కలిపితే మీ ఆరోగ్యానికి హాని కలుగుతుందని, అనేక వ్యాధుల ముప్పు పెరుగుతుందని మీకు తెలుసా? పెరుగులో సహజమైన తీపి ఉంటుంది, ఇది శరీరానికి మేలు చేస్తుంది. మరోవైపు, మీరు అందులో అదనపు చక్కెరను కలిపి తింటే, అది మీ ఆరోగ్యానికి హాని చేస్తుందంటున్నారు నిపుణులు. పెరుగు, పంచదార ప్రతిరోజూ తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. వాస్తవానికి, చక్కెర అధిక కేలరీలు కలిగి ఉంటుంది. ఇవి వేగంగా బరువును పెంచుతాయి. ఇది ఊబకాయాన్ని పెంచుతుంది. ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది. అంతేకాదు, చక్కెర ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. లాక్టోస్ సహజంగా పెరుగులో ఉంటుంది. ఇది ఒక రకమైన చక్కెర. దీనికి అదనంగా చక్కెరను కలుపుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరిగే ప్రమాదం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి
ఉదయం 9:15 లోగా ఆఫీసులో ఉండాల్సిందే.. లేకపోతే ??
Viral VIdeo: లోకోపైలట్ల సాహసం.. ఏం చేశారో చూడండి
కళ్లకు గంతలు.. చేతిలో కుండలు.. చిన్నారి స్కేటింగ్ విన్యాసాలు