అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు..

అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు..

J Y Nagi Reddy

| Edited By: Srikar T

Updated on: Jun 26, 2024 | 3:45 PM

నంద్యాల జిల్లా మహానంది అలయం పరిసరాల్లో చిరుతపులి గత కొంత కాలంగా హల్ చల్ చేస్తూంది. నిన్న అర్థరాత్రి ఆలయం సమీపంలోని గోశాల వద్ద కొంతసేపు సంచరించిన దృశ్యాలు సిసి కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. గత వారం రోజులుగా ఆలయ పరిసరాలతో పాటు ఆలయ సమీపంలోని ఈశ్వర్ నగర్ కాలనీలో సచరించడం తీవ్ర కలకలం రేపుతుంది. అలాగే ఆలయ అన్నదాన సత్రం వెనక భాగంలో కుక్కల మందపై చిరుత దాడి చేసి లాక్కెల్లినట్లు స్థానికులు చెబుతున్నారు. చిరుతపులి గాండ్రిపులు విన్న స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.

నంద్యాల జిల్లా మహానంది అలయం పరిసరాల్లో చిరుతపులి గత కొంత కాలంగా హల్ చల్ చేస్తూంది. నిన్న అర్థరాత్రి ఆలయం సమీపంలోని గోశాల వద్ద కొంతసేపు సంచరించిన దృశ్యాలు సిసి కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. గత వారం రోజులుగా ఆలయ పరిసరాలతో పాటు ఆలయ సమీపంలోని ఈశ్వర్ నగర్ కాలనీలో సచరించడం తీవ్ర కలకలం రేపుతుంది. అలాగే ఆలయ అన్నదాన సత్రం వెనక భాగంలో కుక్కల మందపై చిరుత దాడి చేసి లాక్కెల్లినట్లు స్థానికులు చెబుతున్నారు. చిరుతపులి గాండ్రిపులు విన్న స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. చిరుత సంచారంపై ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. మైకుల ద్వారా సూచనలు ఇస్తున్నారు. చిరుతపులి ఆలయ సమీపంలో తిరుగుతున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు దానిని పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ఫారెస్ట్ అధికారులు తగు చర్యలు చేపట్టి చిరుతపులిని బంధించాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…