WhatsApp New feature: సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!

WhatsApp New feature: సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!

Anil kumar poka

|

Updated on: Jun 26, 2024 | 5:06 PM

యూజర్లకు ఎప్పటికప్పుడు అధునాతన, మెరుగైన ఫీచర్లను అందించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. యూజర్ల కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ‘వాట్సప్ యాప్’ నుంచే సాధారణ కాలింగ్ ఆప్షన్‌ అందించేందుకు ‘మెటా’ కృషి చేస్తోంది. ఈ మేరకు త్వరలోనే ‘ఇన్-యాప్ డయలర్ ఫీచర్‌’ని జోడించబోతోంది.

యూజర్లకు ఎప్పటికప్పుడు అధునాతన, మెరుగైన ఫీచర్లను అందించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. యూజర్ల కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ‘వాట్సప్ యాప్’ నుంచే సాధారణ కాలింగ్ ఆప్షన్‌ అందించేందుకు ‘మెటా’ కృషి చేస్తోంది. ఈ మేరకు త్వరలోనే ‘ఇన్-యాప్ డయలర్ ఫీచర్‌’ని జోడించబోతోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్ వాట్సప్‌లో ఉండే సాధారణ కాల్స్ చేసుకోవచ్చు. కాలింగ్ కోసం యాప్ నుంచి ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఉండదు. నేరుగా వాట్సప్ నుంచే కాల్స్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆండ్రాయిడ్ అప్‌డేటెడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉందని వాట్సప్‌బీటాఇన్ఫో(WABetaInfo) రిపోర్ట్ పేర్కొంది.

వాట్సప్ యూజర్ యాప్ నుంచి ఎగ్జిట్ కాకుండానే కాల్స్ చేసుకోవచ్చు, ఇందుకోసం యూజర్లు కాంటాక్ట్ బుక్‌ను యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది. యాప్‌లో కుడివైపున దిగువన కొత్త ఫ్లోటింగ్ యాక్షన్ బటన్‌ కనిపిస్తుందని, దీనికి యాక్సెస్ ఇస్తే కాల్స్ సులభంగా చేసుకోవచ్చునని వాట్సప్‌బీటాఇన్ఫో రిపోర్ట్ వివరించింది. కాలింగ్‌తో పాటు మెసేజింగ్ షార్ట్‌కట్ డయలర్ స్క్రీన్‌లో కూడా అందుబాటులో వస్తుందని వివరించింది. పరిశీలన కోసం ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమందికే అందుబాటులో ఉందని, రాబోయే రోజుల్లో మరింత మందికి అందుబాటులోకి వస్తుందని నివేదిక పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.