జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి

జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి

Phani CH

|

Updated on: Jun 26, 2024 | 3:17 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. జుట్టు అనేది మగవారికైనా, ఆడవారికైనా చాలా ముఖ్యం. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఇలా అనేక కారణాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టుకు విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ని అప్లై చేస్తున్నారు. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని అనుకుంటున్నారు.

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. జుట్టు అనేది మగవారికైనా, ఆడవారికైనా చాలా ముఖ్యం. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఇలా అనేక కారణాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టుకు విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ని అప్లై చేస్తున్నారు. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని అనుకుంటున్నారు. మరి విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఎంత వరకు జుట్టు సమస్యలను తగ్గించి.. ఆరోగ్యంగా ఉంచుతుంది? వాటిని ఎలా ఉపయోగించాలి? పెరుగు – విటమిన్ ఈ క్యాప్సూల్స్.. పెరుగు కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. మీ జుట్టుకు సరిపడా పెరుగు తీసుకొని, విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒకటి వేసి బాగా కలిపి తలకు పట్టించాలి. జుట్టు కాస్త పొడవుగా ఉంటే రెండు ఈ క్యాప్సూల్స్‌ వేయొచ్చు. ఓ అరగంట తర్వాతా షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు పెట్టినా.. మీ జుట్టు బలంగా, సాఫ్ట్‌గా తయారవుతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది. అలాగే గుడ్డు – విటమిన్ ఈ క్యాప్సూల్స్ మిశ్రమం కూడా జుట్టు రాలడాన్ని కంట్రోల్‌ చేస్తుంది. ఒక గిన్నెలోకి గుడ్డు తెల్ల సొన, విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఈ రెండూ కలపండి. దీన్ని జుట్టుకు బాగా పట్టించండి. ఓ పావు గంట సేపు తర్వాత షాంపూతో వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల జుట్టు సాఫ్ట్‌గా, బలంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. జుట్టు పెరిగేందుకు హెల్ప్ చేస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉదయం 9:15 లోగా ఆఫీసులో ఉండాల్సిందే.. లేకపోతే ??

Viral VIdeo: లోకోపైలట్ల సాహసం.. ఏం చేశారో చూడండి

కళ్లకు గంతలు.. చేతిలో కుండలు.. చిన్నారి స్కేటింగ్ విన్యాసాలు

రామాపురం కాదది యమపురం… ఆ బీచ్‌కు వెళ్ళారా… అంతే సంగతులు

వావ్‌! 27 ఏళ్ల తర్వాత.. ఆ అమ్మాయి.. ఈ అబ్బాయి!