కళ్లకు గంతలు.. చేతిలో కుండలు.. చిన్నారి స్కేటింగ్ విన్యాసాలు

కళ్లకు గంతలు.. చేతిలో కుండలు.. చిన్నారి స్కేటింగ్ విన్యాసాలు

Phani CH

|

Updated on: Jun 26, 2024 | 3:10 PM

ఇటీవల కాలంలో ఎంతోమంది చిన్నవయసులోనే అసాధారణ ప్రతిభను చాటుతున్నారు. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. నెలల వయసులోనే చిన్నారులు తమ ప్రత్యేకతను చాటుతూ రికార్డులు సాధిస్తున్నారు. తాజాగా ఓ ఏడేళ్ల చిన్నారి కళ్లకు గంతలు కట్టుకుని స్కేటింగ్‌ చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పటానికి చెందిన ధన్విత అనే ఏడేళ్ల చిన్నారి మల్టీ టాస్క్ స్కేటింగ్ చేసి ప్రపంచ రికార్డును సొంతంచేసుకుంది.

ఇటీవల కాలంలో ఎంతోమంది చిన్నవయసులోనే అసాధారణ ప్రతిభను చాటుతున్నారు. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. నెలల వయసులోనే చిన్నారులు తమ ప్రత్యేకతను చాటుతూ రికార్డులు సాధిస్తున్నారు. తాజాగా ఓ ఏడేళ్ల చిన్నారి కళ్లకు గంతలు కట్టుకుని స్కేటింగ్‌ చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పటానికి చెందిన ధన్విత అనే ఏడేళ్ల చిన్నారి మల్టీ టాస్క్ స్కేటింగ్ చేసి ప్రపంచ రికార్డును సొంతంచేసుకుంది. తణుకు నుంచి పెనుగొండ మండలం సిద్ధాంతం వరకు జాతీయ రహదారిపై సుమారు 18 కిలోమీటర్లు ఓ పక్కన స్కేటింగ్ చేస్తూనే మరో పక్క విన్యాసాలతో అందర్నీ అబ్బురపరిచింది. స్కేటింగ్ చేస్తూ ముందుకు సాగుతూ తలపై జ్యోతితో ఉన్న కుండలని పెట్టుకుని విన్యాసాలు చేసింది. అనంతరం కళ్ళకు గంతలు కట్టుకుని, కర్ర సాము చేస్తూ, బ్యాక్ స్కేటింగ్ చేస్తూ, ఒక చేతితో కర్ర పట్టుకుని మరొక చేతితో కుండ పట్టుకుని , అలాగే జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ, రోల్ బాల్ ఆడుతూ, ట్యూబ్ లైట్లను చేతులతో పగలకొడుతూ ఇలా రకరకాల విన్యాసాలతో 18 కిలోమీటర్ల పాటు జాతీయ రహదారిపై విన్యాసాలు చేస్తూ ముందుకు సాగింది. ఈ స్కేటింగ్ ప్రదర్శనకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. ఈ విన్యాసాలను స్వయంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కోఆర్డినేటర్ నరేంద్ర గౌడ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ పెద్ద ఈశ్వర్ పలువురు టిడిపి నేతలు చిన్నారికి సర్టిఫికెట్స్ తో పాటు, షీల్డ్ లు అందించారు. అదే విధంగా చిన్నారి ధన్వితను మల్టీ టాస్క్ స్కేటింగ్ లో తీర్చిదిద్దిన కోచ్ తోపాటు చిన్నతనం నుండి ధన్వితను ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రామాపురం కాదది యమపురం… ఆ బీచ్‌కు వెళ్ళారా… అంతే సంగతులు

వావ్‌! 27 ఏళ్ల తర్వాత.. ఆ అమ్మాయి.. ఈ అబ్బాయి!

Jr NTR: ‘నా గుండె కోస్తే మా బాబాయ్‌ బాలకృష్ణ కనిపిస్తారు’

టాలీవుడ్ నటికి బెదిరింపు కాల్స్.. అసలు ఏమైందంటే ??

TOP 9 ET News: కల్కి ఊచకోత… ఇవేం రికార్డులురా బాబు.. | కోరిన కోర్కెలు నిజమైన వేళపవన్‌ కఠోర దీక్ష