Viral VIdeo: లోకోపైలట్ల సాహసం.. ఏం చేశారో చూడండి
అప్పుడప్పుడూ సాంకేతిక లోపంతోనో మరో కారణంతోనో వాహనాలు నిలిచిపోతుంటాయి. తాజాగా ఓ రైలు రైల్వేబ్రిడ్జిపై అకస్మాత్తుగా ఆగిపోయింది. అయితే టెక్నీషియన్స్ వచ్చేసరికి ఆలస్యం అవుతుందని భావించిన లోకోపైలట్లు స్వయంగా రంగంలోకి దిగి రిపేర్లు చేశారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ వారు రిపేరు చేసిన విధానం ఆందోళన కలిగించింది. నర్కటీయా గోరఖ్‌పూర్ ప్యాసెంజర్ రైలు.. శుక్రవారం మార్గమధ్యంలో ఓ రైల్వే బ్రిడ్జిపై సడన్‌గా ఆగిపోయింది.
అప్పుడప్పుడూ సాంకేతిక లోపంతోనో మరో కారణంతోనో వాహనాలు నిలిచిపోతుంటాయి. తాజాగా ఓ రైలు రైల్వేబ్రిడ్జిపై అకస్మాత్తుగా ఆగిపోయింది. అయితే టెక్నీషియన్స్ వచ్చేసరికి ఆలస్యం అవుతుందని భావించిన లోకోపైలట్లు స్వయంగా రంగంలోకి దిగి రిపేర్లు చేశారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ వారు రిపేరు చేసిన విధానం ఆందోళన కలిగించింది. నర్కటీయా గోరఖ్‌పూర్ ప్యాసెంజర్ రైలు.. శుక్రవారం మార్గమధ్యంలో ఓ రైల్వే బ్రిడ్జిపై సడన్‌గా ఆగిపోయింది. ఇంజెన్‌లోని అన్‌లోడర్ వాల్వ్‌లో అకస్మాత్తుగా గాలి పీడనం తగ్గిపోవడంతో రైలు నిలిచిపోయింది. అయితే, మరమ్మతు చేసేందుకు టెక్నీషియన్లు రావడానికి కొంత సమయం పడుతుందని ప్రధాన లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్ గుర్తించారు. దీంతో, తామే స్వయంగా సమస్యను పరిష్కరించేందుకు సాహసం చేశారు. లోకోపైలట్లలో ఒకరు రైలు కింద దూరి రిపేర్లు చేయగా మరో లోకోపైలట్ అత్యంత సాహసోపేతంగా బ్రిడ్జి అంచులను పట్టుకుని వేలాడుతున్నట్టుగా నడుస్తూ సమస్య ఉన్న చోటుకు వెళ్లి మరమ్మతు చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇద్దరు లోకోపైలట్లు తమ రైలు ఇంజన్‌కు అత్యంత ప్రమాదకర రీతిలో రిపేర్లు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కళ్లకు గంతలు.. చేతిలో కుండలు.. చిన్నారి స్కేటింగ్ విన్యాసాలు
రామాపురం కాదది యమపురం… ఆ బీచ్‌కు వెళ్ళారా… అంతే సంగతులు
వావ్! 27 ఏళ్ల తర్వాత.. ఆ అమ్మాయి.. ఈ అబ్బాయి!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

