రామాపురం కాదది యమపురం... ఆ బీచ్‌కు వెళ్ళారా... అంతే సంగతులు

రామాపురం కాదది యమపురం… ఆ బీచ్‌కు వెళ్ళారా… అంతే సంగతులు

Phani CH

|

Updated on: Jun 26, 2024 | 3:08 PM

బాపట్ల జిల్లాలోని రామాపురం బీచ్‌లో విహారయాత్రలు విషాదయాత్రలుగా మారుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఇక్కడ బీచ్‌లో విహారయాత్రలకు వచ్చిన ఆరుగురు విద్యార్దులు సముద్రపు అలల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. తాజాగా శుక్రవారం మరో నలుగురు విద్యార్ధులు సముద్రంలో ఈతకు వెళ్ళి గల్లంతైతే వీరిలో ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో విద్యార్ది మృతదేహం లభ్యం కాలేదు.

బాపట్ల జిల్లాలోని రామాపురం బీచ్‌లో విహారయాత్రలు విషాదయాత్రలుగా మారుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఇక్కడ బీచ్‌లో విహారయాత్రలకు వచ్చిన ఆరుగురు విద్యార్దులు సముద్రపు అలల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. తాజాగా శుక్రవారం మరో నలుగురు విద్యార్ధులు సముద్రంలో ఈతకు వెళ్ళి గల్లంతైతే వీరిలో ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో విద్యార్ది మృతదేహం లభ్యం కాలేదు. దీంతో రామాపురం బీచ్‌ విహారయాత్రలకు వచ్చే విద్యార్ధులకు మృత్యుకుహరంగా మారిపోయింది. రామాపురం బీచ్‌లో విహారయాత్రలకు వచ్చే విద్యార్ధుల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. కోనసీమ, హైదరాబాద్‌, చెన్నై నుంచి వచ్చే విద్యార్ధులు సముద్రంలో ఈతకు వెళ్ళి అలల తాకిడికి మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఈరోజు శుక్రవారం ఏలూరు జిల్లాకు చెందిన 11 మంది విద్యార్ధులు రామాపురం బీచ్‌లో విహారయాత్రకు వచ్చారు. వీరంతా సముద్రంలో సరదాగా ఈతకు వెళ్ళారు. స్థానికేతరులు కావడంతో ఎంత లోతులో ఈతకు వెళ్ళాల్లో తెలియక సముద్రంలో కొంతదూరం వెళ్ళారు. పెద్ద అలలు రావడంతో 11 మంది విద్యార్దుల్లో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్ధులు నితిన్ అమలరాజు, తేజ, కిషోర్లుగా గుర్తించారు. కొద్దిసేపటికి మూడు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో విద్యార్ధి మృతదేహం కోసం మెరైన్ పోలీసులు గాలింపు చేపట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వావ్‌! 27 ఏళ్ల తర్వాత.. ఆ అమ్మాయి.. ఈ అబ్బాయి!

Jr NTR: ‘నా గుండె కోస్తే మా బాబాయ్‌ బాలకృష్ణ కనిపిస్తారు’

టాలీవుడ్ నటికి బెదిరింపు కాల్స్.. అసలు ఏమైందంటే ??

TOP 9 ET News: కల్కి ఊచకోత… ఇవేం రికార్డులురా బాబు.. | కోరిన కోర్కెలు నిజమైన వేళపవన్‌ కఠోర దీక్ష