ఇస్రో ప్రయోగం సక్సెస్.. ఇక అంతరిక్షంలోనూ వ్యవసాయం..
డిసెంబరు 30న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నింగిలోకి పంపిన స్పేడెక్స్ విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో ఇస్రో పంపిన అలసంద విత్తనాలు తాజాగా మొలకెత్తాయి. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో నాలుగు రోజుల్లోనే ఇవి మొలకెత్తాయి. త్వరలోనే వీటికి ఆకులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది.
అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ కోసం ఉద్దేశించిన స్పేడెక్స్ ప్రయోగంలో పీఎస్ఎల్వీ-సి60 రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఇది ఇస్రో సాధించిన మరో ఘనత. స్పేడెక్స్‌లో ప్రయోగం చేపట్టిన తర్వాత నాలుగు రోజుల్లో అవి మొలకెత్తినట్లు ఇస్రో ప్రకటించింది. కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ పేరుతో పీఎస్ఎల్వీ – సీ 60 రాకెట్ లో ఇస్రో ఓ పేలోడ్‌ను అంతరిక్షంలోకి పంపింది. అందులో 8 అలసంద విత్తనాలు పంపగా, నాలుగు రోజుల్లో అవి మొలకెత్తినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ పేలోడ్‌ను ఇస్రోకు చెందిన విక్రమ్ సారాబాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. అంతరిక్షంలో విత్తనం మొలకెత్తే విధానంతో పాటు రోదసిలోని వ్యర్థాలను ఒడిసిపట్టే రోబోటిక్ హ్యాండ్, హరిత చోదన వ్యవస్థ లాంటి వినూత్న ఉపకరణాలను కూడా ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పాలకూర పెరుగుదలను కూడా పరీక్షించనున్నారు. .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OYO: ప్రేమికులకు షాకిచ్చిన ఓయో.. ఈ కొత్త రూల్స్ ఫాలో అవ్వాల్సిందే