AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమల్లోకి వచ్చిన వార్షిక ఫాస్టాగ్ పాస్‌.. ఇలా యాక్టివేట్‌ చేసుకోండి

అమల్లోకి వచ్చిన వార్షిక ఫాస్టాగ్ పాస్‌.. ఇలా యాక్టివేట్‌ చేసుకోండి

Phani CH
|

Updated on: Aug 18, 2025 | 8:43 PM

Share

జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.3 వేల వార్షిక టోల్‌పాస్‌ అమల్లోకి వచ్చింది. రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌లో ఈ పాస్‌ను యాక్టివేట్‌ చేసుకొనేందుకు ఓ లింక్‌ను రవాణాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రహదారి రవాణా, హైవే మంత్రిత్వశాఖ వెబ్‌సైట్లలో కూడా ఈ లింక్‌ అందుబాటులో ఉంది.

జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.3 వేల వార్షిక టోల్‌పాస్‌ అమల్లోకి వచ్చింది. రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌లో ఈ పాస్‌ను యాక్టివేట్‌ చేసుకొనేందుకు ఓ లింక్‌ను రవాణాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రహదారి రవాణా, హైవే మంత్రిత్వశాఖ వెబ్‌సైట్లలో కూడా ఈ లింక్‌ అందుబాటులో ఉంది. కార్లు, జీపులు, వ్యాన్‌లు తదితర వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఈ పాస్‌ వర్తిస్తుంది. ఒక సారి రూ. 3 వేలు కట్టి ఇది తీసుకుంటే.. 200 సార్లు టోల్ గేట్ వద్ద ఎలాంటి చెల్లింపులు రయ్యిమని దూసుకుపోవచ్చు. ఇప్పటి వరకు ఉన్నట్లుగా.. పదేపదే టోల్‌ చెల్లింపులకు ఫాస్టాగ్‌ కార్డులు రీఛార్జ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. రూ.3 వేలతో ఫాస్టాగ్‌ టోల్‌పాస్‌ తీసుకునే కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులు ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. ఈ కొత్త విధానం వ్యక్తిగత కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు చెల్లుబాటు కాదు. 200 ట్రిప్పులు పూర్తయ్యాక మళ్లీ రూ.3వేలతో యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏడాదిలో ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. ఇప్పటికే ఫాస్టాగ్‌ ఉన్నవారు మళ్లీ కొత్త ఫాస్టాగ్‌ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. పాత ఫాస్టాగ్‌తోనే టోల్‌పాస్‌ యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఇక ఒక్కో టోల్‌గేట్‌ను ఒక ట్రిప్పుగా లెక్కిస్తారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లేవారు 4 టోల్‌గేట్లను దాటాల్సి ఉంటుంది. అంటే వారు నాలుగు ట్రిప్పులను పూర్తి చేసినట్లుగా లెక్కిస్తారు. తిరిగి వస్తే మరో నాలుగు ట్రిప్పులుగా పరిగణిస్తారు. అంటే హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లి రావడానికి 8 ట్రిప్పులు అవుతాయి. వార్షిక పాస్‌ తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. తక్కువ ట్రిప్పులు తిరిగేవారు, ఒకేసారి రూ.3వేలు చెల్లించడానికి ఇష్టపడనివారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్టాగ్‌ విధానాన్ని కొనసాగిస్తూ టోల్‌గేట్లలో వసూలు చేసే ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఒక్కో టోల్‌గేట్‌ దాటడానికి సగటున రూ.15 ఖర్చవుతుంది. ఇప్పుడున్న విధానం ప్రకారం ఒక్కో గేట్‌వద్ద కనీసం రూ.50 చెల్లిస్తారనుకుంటే.. 200 గేట్లు దాటడానికి రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక పాస్‌తో ఇది రూ.3 వేలకు తగ్గుతుంది. దీనివల్ల వాహనదారులకు ఏటా సగటున రూ.7 వేల ప్రయోజనం చేకూరుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరో అద్భుతం.. ఇకపై రోబోలతో పిల్లల్ని కనొచ్చు!

రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ షాక్‌.. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారిపై అధిక ప్రభావం

రోజుకు రూ.45 పెట్టుబడి పెడితే.. చేతికి రూ.25లక్షలు ఎల్ఐసీలో బెస్ట్ పాలసీ!

ఫాస్టాగ్ వార్షిక‌ పాస్‌కు అనూహ్య స్పందన..

EPFO: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్ న్యూస్..