6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక సబ్జెక్టుగా భగవద్గీత !!

గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో భగవద్గీత బోధన తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి జీతూ వాఘానీ విద్యార్థులకు ఇప్పుడు పాఠ్యాంశాల్లో భాగంగా పవిత్ర గ్రంథం భగవద్గీతని బోధించనున్నామని చెప్పారు.

6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక సబ్జెక్టుగా భగవద్గీత !!

|

Updated on: Mar 31, 2022 | 9:57 AM

గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో భగవద్గీత బోధన తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి జీతూ వాఘానీ విద్యార్థులకు ఇప్పుడు పాఠ్యాంశాల్లో భాగంగా పవిత్ర గ్రంథం భగవద్గీతని బోధించనున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి భగవద్గీత బోధిస్తామని వెల్లడించారు. ‘భారతీయ సంస్కృతి , విజ్ఞాన వ్యవస్థ’ని పెంపొందించడమే ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరం, 2022-23 నుండి గుజరాత్ పాఠశాలల్లో భగవద్గీత పఠనాన్ని అమలు చేయనున్నారు. ఇకపై స్కూళ్లలో భగవద్గీతను ప్రత్యేక సబ్జెక్టుగా బోధించనున్నారు. 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు పుస్తకాల్లో కథ, పారాయణ రూపంలోను, 9 నుంచి 12వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్‌గా భగవద్గీతను ప్రవేశపెడతామని విద్యాశాఖ మంత్రి జీతూ వాఘానీ చెప్పారు.

Also Watch:

MS Dhoni: అందుకే ధోని నెంబర్‌-7 జెర్సీ ధరిస్తాడంటా !!

Viral Video: మంచు కొండల్లో బైక్ రైడింగ్ !! కట్ చేస్తే ఊహించని సీన్ !!

Viral Video: పాములతో గేమ్స్‌ ఆడాడు !! చివరకు అనూహ్యమైన ట్విస్ట్‌ !!

Viral Video: అందమైన దృశ్యం !! ఎలుకను రోడ్డు దాటించిన కాకి !!

Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు !!

Follow us