Viral Video: పాములతో గేమ్స్ ఆడాడు !! చివరకు అనూహ్యమైన ట్విస్ట్ !!
పాములతో చెలగాటం ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ యువకుడు. ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి మూడు కింగ్‌కోబ్రాలతో ఆడుకోబోయాడు కర్నాటకకు చెందిన ఫేమస్ యూట్యూబర్ మాజ్ సయ్యద్.
పాములతో చెలగాటం ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ యువకుడు. ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి మూడు కింగ్‌కోబ్రాలతో ఆడుకోబోయాడు కర్నాటకకు చెందిన ఫేమస్ యూట్యూబర్ మాజ్ సయ్యద్. పాము తోకలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ వాటిని రెచ్చగొట్టాడు. మాజ్ సయ్యద్ చేష్టలపై ఆగ్రహంతో ఉన్న ఓ కోడెనాగు అదను చూసి కాటేసింది. కాటు మాత్రమే వేయలేదు. కసిగా కాలును పట్టుకుంది ఆ విషసర్పం. కర్నాటక లోని సిర్సీకి చెందిన మాజ్ సయ్యద్‌కు ఇలాంటి ఫీట్లు చేసి యూట్యూబ్‌లో పెట్టడం సరదా . కాని ఆ సరదానే కొంపముంచింది. పాముకాటుకు ఆస్పత్రి పాలయ్యాడు మాజ్ సయ్యద్. పాములను పట్టే తీరు ఇది కాదని , ప్రాణాంతకం అవుతుందని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. పదేపదే మూడు పాములను రెచ్చగొట్టాడు మాజ్ సయ్యద్. మనుషుల కదలికలను పాములు జాగ్రత్తగా గమనిస్తాయని తెలిపారు ఫారెస్ట్ అధికారులు. ఇలాంటి ఫీట్స్ ఎవరు చేయవద్దని హెచ్చరించారు.
Also Watch:
Viral Video: అందమైన దృశ్యం !! ఎలుకను రోడ్డు దాటించిన కాకి !!