రేస్‌కార్లే రూట్ మార్చాయి.. భారత డ్రైవర్‌ జస్ట్ మిస్

రేస్‌కార్లే రూట్ మార్చాయి.. భారత డ్రైవర్‌ జస్ట్ మిస్

Phani CH

|

Updated on: Sep 19, 2024 | 10:29 AM

వాయువేగంతో దూసుకెళ్లే రేస్‌కార్లు ఢీకొనడం ఎప్పుడైనా చూశారా? ఫార్ములా 2 రేసులో అదే జరిగింది. ఈ ప్రమాదంలో భారత డ్రైవర్‌ కుశ్‌ మైనీకి పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ పెనాల్టీ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఫార్ములావన్‌ అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి ప్రధాన రేస్‌కు ముందు ఫార్ములా2 ఫీచర్‌ రేస్‌ను నిర్వహిస్తారు.

వాయువేగంతో దూసుకెళ్లే రేస్‌కార్లు ఢీకొనడం ఎప్పుడైనా చూశారా? ఫార్ములా 2 రేసులో అదే జరిగింది. ఈ ప్రమాదంలో భారత డ్రైవర్‌ కుశ్‌ మైనీకి పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ పెనాల్టీ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఫార్ములావన్‌ అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి ప్రధాన రేస్‌కు ముందు ఫార్ములా2 ఫీచర్‌ రేస్‌ను నిర్వహిస్తారు. ఇందులో.. 23 ఏళ్ల కుశ్‌ ఇన్‌విక్టా రేసింగ్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే, రేస్‌ మొదలయ్యే సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రేస్‌ ఆరంభంలో సాంకేతిక లోపం కారణంగా జరిగిన పొరపాటుతో కార్లు ఢీకొన్నాయి. రేస్‌ స్టార్ట్‌ లైన్‌ వద్ద ఇంజిన్‌లో సమస్య ఏర్పడటంతో కుశ్‌ కారు స్టార్ట్‌ కాకుండానే ఆగిపోయింది. దాంతో వెనుక నుంచి దూసుకొచ్చిన ఇతర డ్రైవర్లు జోసెఫ్‌ మారియా, ఒలీవర్‌ గోత్‌లను ఇది గందరగోళానికి గురి చేసింది. ఆ రెండు కార్లూ తీవ్ర వేగంతో వచ్చి కుశ్‌ కారును బలంగా ఢీకొట్టాయి. ఆ తాకిడికి కార్లు చిన్నాభిన్నం అయ్యాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి.. ఇక భార్య భర్తలు

పాసింగ్ అవుట్ పరేడ్ కు వచ్చిన తల్లికి ఎస్ఐ పాదాభివందనం

హైదరాబాద్‌లో ఉన్నన్ని సదుపాయాలు మరెక్కడా లేవు

గణేష్‌ దర్శనానికి వచ్చిన నాగేంద్రుడు !! దైవ మహిమే అంటున్న భక్తులు

శోభాయాత్రలో స్టెప్పులు వేశాడు.. ఇంటికెళ్లి కూప్పకూలాడు