తల్లి పాల కంటే గోవు పాలు శ్రేష్టం.. సినీ నటుడు సుమన్

తల్లి పాల కంటే గోవు పాలు శ్రేష్టం.. సినీ నటుడు సుమన్

Phani CH

|

Updated on: Sep 18, 2024 | 9:39 PM

గోవు సాధు జంతువని నటుడు సుమన్‌ అన్నారు. దీనిని రక్షించుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. ఆయుర్వేదంలో కూడా గోవుకు విశిష్టత ఉందన్నారు. హైదరాబాద్‌లోని కాచిగూడలో జరిగిన భక్తుల ఆత్మీయ సమ్మేళనంలో సినీ నటుడు సుమన్‌ పాల్గొన్నారు. బాలకృష్ణ గురుస్వామి చేపట్టనున్న కాశ్మీర్ టు కన్యాకుమారి గో పాదయాత్రకు మద్దతుగా సినీ యాక్టర్ సుమన్ విచ్చేశారు.

గోవు సాధు జంతువని నటుడు సుమన్‌ అన్నారు. దీనిని రక్షించుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. ఆయుర్వేదంలో కూడా గోవుకు విశిష్టత ఉందన్నారు. హైదరాబాద్‌లోని కాచిగూడలో జరిగిన భక్తుల ఆత్మీయ సమ్మేళనంలో సినీ నటుడు సుమన్‌ పాల్గొన్నారు. బాలకృష్ణ గురుస్వామి చేపట్టనున్న కాశ్మీర్ టు కన్యాకుమారి గో పాదయాత్రకు మద్దతుగా సినీ యాక్టర్ సుమన్ విచ్చేశారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఇందుకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గో రక్ష మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు అఖిలభారత గో సేవ ఫౌండేషన్ ఫౌండర్ బాలకృష్ణ గురుస్వామి అన్నారు. గోవుని కాపాడుకుందాం అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడుకుందామని తెలిపారు. దేశవాళీ గోవులను ఎడ్లను కాపాడాలని, గో ఉత్పత్తులను వాడి.. గో ఆధారిత వ్యవసాయం చేయాలన్నారు. ఈ మట్టిని, భూమిని కాపాడి.. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా జీవించే విధంగా.. గో సంతతి వల్ల కలిగే ప్రయోజనాలు ఊరూరా చాటేలా చేయడమే తమ లక్ష్యమని బాలకృష్ణ గురుస్వామి తెలిపారు. ఇతర దేశాలు మన గోవును వివిధ ప్రయోగాలకు వినియోగించుకుంటున్నారని, కానీ మనదేశంలో గోవులను నిర్దాక్షిణ్యంగా కబేళాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి.. ఇక భార్య భర్తలు

పాసింగ్ అవుట్ పరేడ్ కు వచ్చిన తల్లికి ఎస్ఐ పాదాభివందనం

హైదరాబాద్‌లో ఉన్నన్ని సదుపాయాలు మరెక్కడా లేవు

గణేష్‌ దర్శనానికి వచ్చిన నాగేంద్రుడు !! దైవ మహిమే అంటున్న భక్తులు

శోభాయాత్రలో స్టెప్పులు వేశాడు.. ఇంటికెళ్లి కూప్పకూలాడు