Flax seeds: అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
అందంగా కనిపించాలని కోరుకోని వారెవరూ ఉండటం లేదు. అందంగా కనిపించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల ప్రాడెక్ట్స్ వాడుతూ.. బ్యూటీ పార్లర్స్‌కి వెళ్తూ చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. అందంగా ఉండాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల.. లోపల నుంచి అందంగా కనిపిస్తారు. ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలో అవిసె గింజలు చక్కగా పని చేస్తాయి.
అందంగా కనిపించాలని కోరుకోని వారెవరూ ఉండటం లేదు. అందంగా కనిపించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల ప్రాడెక్ట్స్ వాడుతూ.. బ్యూటీ పార్లర్స్‌కి వెళ్తూ చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. అందంగా ఉండాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల.. లోపల నుంచి అందంగా కనిపిస్తారు. ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలో అవిసె గింజలు చక్కగా పని చేస్తాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి, జుట్టుకు ఎంతో మేలుచేస్తాయి. ప్రతి రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యాంగా ఉంటుంది. అవిసె గింజల్ని ఉడికించి.. ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఉడికించిన అవిసె గింజల్ని.. నీటిలో వేస్తే పైన జెల్ రూపంలో వస్తుంది. ఆ జెల్‌ను ముఖానికి ప్యాక్‌లా అప్లైచేసి, 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయాలి. మచ్చలు, మొటిమలు తగ్గి ముఖం కాంతి వంతంగా తయారవుతుంది. అవిసె గింజల పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి.. కాటన్ సహాయంతో ముఖంపై రాయండి. ఇలా చేస్తే చర్మంపై గీతలు, దద్దుర్లు వంటివి తగ్గుతాయి. నాలుగు గంటల పాటు నానబెట్టిన అవిసె గింజలను రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ, చేతులపై రాసుకుంటే.. ముఖం శుభ్ర పడి, మురికి పోతుంది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి.. ముఖం కాంతి వంతంగా మెరుస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

