Tribes: గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. గర్భిణీని రెండు కిలోమీటర్లు డోలీలో మోసిన గిరిజనులు.
ఇంకెన్నాళ్లీ కష్టాలు.. అభివృద్ధి అంటే పట్టణాలు, నగరాలేనా? మారుమూల పల్లెలు, గూడాలు, తండాలు అభివృద్ధికి నోచుకోవా? రోడ్డు మార్గం అందని కలేనా? అనారోగ్యం పాలైతే డోలియే మార్గామా? ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు కనీస సదుపాయాలు లేక, డోలీలనే నమ్ముకోవాల్సి వస్తుంది. తాజాగా అల్లూరి జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇంకెన్నాళ్లీ కష్టాలు.. అభివృద్ధి అంటే పట్టణాలు, నగరాలేనా? మారుమూల పల్లెలు, గూడాలు, తండాలు అభివృద్ధికి నోచుకోవా? రోడ్డు మార్గం అందని కలేనా? అనారోగ్యం పాలైతే డోలియే మార్గామా? ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు కనీస సదుపాయాలు లేక, డోలీలనే నమ్ముకోవాల్సి వస్తుంది. తాజాగా అల్లూరి జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం బొడ్లమామిడిలో నిండు గర్భిణీకి డోలి కష్టాలు ఎదురయ్యాయి. రోడ్డు సదుపాయం సరిగా లేక అంబులెన్స్ రాలేక సన్యాసమ్మ అనే గర్భిణీ నరకయాతన అనుభవించింది. దాదాపు రెండు కిలోమీటర్లు డోలిలో గర్భిణిని ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. డుంబ్రిగుడ మండలం కొల్లాపూట్ పంచాయతీకి చెందిన బొడ్ల మామిడి గ్రామస్తురాలు సన్యాసమ్మకు డెలివరీ సమయం కావడంతో పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే 108కు గ్రామస్తులు ఫోన్ చేశారు. అయితే గ్రామం వరకు రోడ్డు సరిగా లేక.. అంబులెన్స్ రాలేదని డ్రైవర్ చెప్పాడు. దీంతో చేసేది లేక సన్యాసమ్మకు డోలి కట్టారు. రెండు కిలోమీటర్లు డోలిమోత మోసుకెళ్ళి గ్రామస్తులు అంబులెన్స్ ఎక్కించారు. రోడ్డు పనులు ప్రారంభించి చాలాకాలం అవుతున్నా అది పూర్తికాలేదని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా రోడ్లు భవనాల శాఖ రోడ్డు పనులు పూర్తి చేసి మున్ముందు తమకు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

