AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు

Phani CH
|

Updated on: Mar 17, 2026 | 7:58 PM

Share

భారతీయ రైల్వే తన 40 ఏళ్ల పాత సాఫ్ట్‌వేర్ స్థానంలో ఆధునిక, వేగవంతమైన టికెట్ రిజర్వేషన్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతోంది. ఏప్రిల్-జూన్ మధ్య అందుబాటులోకి వచ్చే ఈ కొత్త వ్యవస్థ నిమిషానికి లక్షకు పైగా టికెట్లు, 40 లక్షల ఎంక్వైరీలను నిర్వహించగలదు. ₹1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్ట్, సైబర్ రక్షణకు ₹600 కోట్లు కేటాయించింది. ఇది ప్రయాణికులకు సులభమైన, వేగవంతమైన, సురక్షితమైన బుకింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

భారతీయ రైల్వే తన టికెట్ రిజర్వేషన్ వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దాదాపు 40 ఏళ్లుగా కొనసాగుతున్న పాత సాఫ్ట్‌వేర్‌ స్థానంలో, అత్యంత వేగవంతమైన ఆధునిక ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త వ్యవస్థ ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న సిస్టమ్ తరచూ నెమ్మదిగా పనిచేయడం, తత్కాల్ బుకింగ్ సమయంలో క్రాష్ అవ్వడం వంటి సమస్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో “పీఆర్ఎస్ ఆధునికీకరణ ఫేజ్ 2” పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఈ కొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ సిస్టమ్ టెస్టింగ్ దశలో ఉందని, ఏప్రిల్-జూన్ మధ్యలో లైవ్‌లోకి వస్తుందని క్రిస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొత్త సిస్టమ్ ద్వారా టికెట్ బుకింగ్ సామర్థ్యం భారీగా పెరగనుంది. ప్రస్తుతం నిమిషానికి 25,000 టికెట్లు మాత్రమే బుక్ చేయగలుగుతుండగా, కొత్త వ్యవస్థతో నిమిషానికి లక్షకు పైగా టికెట్లు బుక్ చేయవచ్చు. అలాగే, టికెట్ ఎంక్వైరీల సామర్థ్యం కూడా నిమిషానికి 4 లక్షల నుంచి 40 లక్షలకు పెరగనుంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం సుమారు రూ. 1,000 కోట్లు ఖర్చు చేస్తోంది. సైబర్ దాడులు మరియు బాట్‌ల నుండి రక్షణ కల్పించేందుకు రూ. 600 కోట్లతో ప్రత్యేకంగా ‘ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్’ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్పుల వల్ల సామాన్యులకు టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా ఇంకా సురక్షితంగా మారుతుందని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దారుణం.. నలుగురి ప్రాణం తీసిన పొగ..

Dubai: యుద్ధం దెబ్బకు ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌.. మొత్తం గంగార్పణం

భూగర్భంలో ఇరాన్‌ ‘మిస్సైల్‌ సిటీ’.. అమెరికాకు కొత్త సవాళ్లు

షిర్డీ అన్నప్రసాదాన్ని.. తాకని ‘గ్యాస్‌ సెగలు’.. ఎందుకంటే..

యుద్ధరంగంలోకి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’..!

Follow Us