Kingdom: విజయ్ ఖాతాలో మరో హిట్ ?? కింగ్‌డమ్ సినిమా ఎలా ఉందంటే
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా కింగ్డమ్. వరుస విజయాలతో దూసుకుపోతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించడంతో అంచనాలు బాగా పెరిగిపోయాయి. మరి విజయ్ ఆశలను ఈ సినిమా నిలబెట్టిందా లేదా ఈ రివ్యూ లో చూద్దాం.. సూరి అలియాస్ విజయ్ దేవరకొండ తెలంగాణలోని అంకాపూర్ లో ఒక కానిస్టేబుల్.
అతని అన్న శివ అలియాస్ సత్యదేవ్ చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. 18 సంవత్సరాలుగా అన్న కోసం అన్ని చోట్ల వెతుకుతుంటాడు సూరి. సరిగ్గా అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ సూరి అన్న డీటెయిల్స్ ఇవ్వడమే కాకుండా ఎక్కడున్నాడో కూడా చెప్తాడు. కాకపోతే శివను మళ్ళీ తిరిగి తీసుకురావాలి అంటే సూరికి ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి అంటాడు. దానికోసం శ్రీలంక వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి స్పైగా వెళ్లి వాళ్ల మాఫియా గురించి తెలుసుకోమని చెప్తారు. శ్రీలంకలో సూరికి హెల్ప్ చేయడానికి ఒక స్పై భాగ్యశ్రీ బోర్సే ఉంటుంది. అక్కడి నుంచి సూరి మిషన్ శ్రీలంక మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏమైంది అనేది అసలు కథ.. గౌతమ్ తిన్ననూరి అంటే మళ్లీ రావా, జెర్సీ లాంటి ఎమోషనల్ డ్రామాలు గుర్తుకొస్తాయి. కానీ కింగ్డమ్ సినిమాతో తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకున్నాడు ఈ దర్శకుడు. మొదటి సీన్ నుంచే తన మార్కు చూపించడం మొదలుపెట్టాడు. గ్యాంగ్స్టర్ డ్రామాలు తెలుగు ఇండస్ట్రీకి కొత్త కాదు.. కానీ ఉన్న కథను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు గౌతమ్. ఈ క్రమంలో ఫస్ట్ అఫ్ సూపర్ సక్సెస్ అయింది. హీరో క్యారెక్టర్ పరిచయం చేసిన విధానం కూడా చాలా బాగుంది. అక్కడినుంచి శ్రీలంక వెళ్లిన తర్వాత కథ మరింత వేగంగా ముందుకు వెళుతుంది. ఒకరకంగా చెప్పాలంటే మరొక ప్రపంచంలోకి తీసుకెళ్లాడు గౌతం. ఫస్టాఫ్ మొత్తం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లాంటి ఇద్దరు పవర్ఫుల్ యాక్టర్స్ దొరకడంతో గౌతమ్ పని ఇంకా ఈజీ అయింది. తాను అనుకున్న సన్నివేశాలు ఇంకా బాగా ఎలివేట్ కావడానికి వీళ్ల నటన బాగా తోడైంది. అన్నదమ్ముల మధ్య ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఫస్టాఫ్ అంతా హీరో శ్రీలంక వెళ్లడం.. అక్కడ స్పైగా మారడం.. హీరో హీరోయిన్ ట్రాక్ వీటితో వెళ్లిపోయింది. అసలైన కథ ఇంటర్వెల్ కు సెటప్ అయింది. సెకండ్ హాఫ్ ఇంకాస్త వేగంగా వెళ్లి ఉంటే బాగుండేది. అయినా కూడా తన మార్కు చూపించాడు గౌతం. దానికి తోడు విజయ్ దేవరకొండ యాక్షన్ కూడా అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సెకండాఫ్ మాత్రం కాస్త స్లో అయింది. చివరి 20 నిమిషాలు ఊపు తీసుకొచ్చాడు. సెకండ్ పార్ట్ కు సరిపోయే లీడ్ ఇచ్చాడు. గ్యాంగ్స్టర్ డ్రామాలు ఇష్టపడే వాళ్లకు కింగ్డమ్ బెస్ట్ ఛాయిస్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారులో ఏసీ ఆన్ చేస్తే.. మైలేజీ తగ్గుతుందా?
మద్యం మత్తులో.. పామును కసా కసా కొరికి ..
రంగు మారిన టైల్స్.. ఏంటా అని చెక్ చేయగా షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

