AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంగు మారిన టైల్స్‌.. ఏంటా అని చెక్‌ చేయగా షాక్‌

రంగు మారిన టైల్స్‌.. ఏంటా అని చెక్‌ చేయగా షాక్‌

Phani CH
|

Updated on: Jul 29, 2025 | 9:41 PM

Share

మనకు దృశ్యం సినిమా అనగానే టక్కున గుర్తొచ్చేది మాత్రం అందులో మర్డర్‌ సీన్‌. దశాబ్దకాలం క్రితం వచ్చిన ఆ సినిమాను ఇప్పుడు టీవీలో వచ్చినా.. అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. అందులో హీరో చేసిన హత్య.. ఆపై ఆ శవాన్ని కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ కిందే పాతిపెట్టడం సినిమాకే హైలైట్‌. కాగా.. తాజాగా అదే సినిమాలోని సీన్‌ను ప్రేరణగా తీసుకుని భర్తను హత్య చేసిందో భార్య.

భర్తను చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే టైల్స్‌ కింద పూడ్చిపెట్టేసింది. లవర్‌తో కలిసి మరీ భర్తను హత్య చేసి టైల్స్‌ కింద పూడ్చిపెట్టేసింది. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలోని విజయ్‌ చావన్‌, కోమల భార్యా భర్తలు. వీరు ముంబైకి 70 కి.మీ దూరంలోని గాడ్గపడాలో ఉంటున్నారు. అన్యోన్యంగా ఉండే వీరి జీవితంలోకి మోను అనే వ్యక్తి ప్రవేశించాడు. ప్రేమ.. అంటూ కోమలను బుట్టలో వేసుకున్నాడు. భర్తను అడ్డుతొలగించుకుంటే.. తామిద్దరం హాయిగా బతకొచ్చని నమ్మబలికి.. కోమల సాయంతో.. ఆమె భర్తను కడతేర్చాడు. మర్ఢర్ తర్వాత డెడ్ బాడీని కోమల ఇంట్లోనే పూడ్చిపెట్టేందుకు మోను ప్లాన్ వేశాడు. కోమల సాయంతో టైల్స్ పగలగొట్టి.. కింద గుంత తవ్వి.. శవాన్ని అందులో పూడ్చి.. తిరిగి కొత్త టైల్స్ మార్చేశారు. తర్వాత ఇంటికి తాళంవేసి మోను,కోమల పరారయ్యారు. అయితే విజయ్‌ సోదరుడికి అనుమానం వచ్చి, అన్న ఇంటికి రాగా తాళం వేసి ఉండటం, అన్న ఫోన్ పనిచేయకపోవటం, వదిన అయిన కోమల కూడా కనిపించకపోవటంతో.. బంధువులను ఆరా తీశాడు. అప్పటికీ జాడ లేకపోవటంతో తాళం పగలగొట్టి ఇంటిలోకి వెళ్లాడు. కాగా.. అక్కడి ఒక గదిలో ఒకవైపు కొత్త టైల్స్ వేసి ఉండటం గమనించి, అనుమానం వచ్చి అక్కడి టైల్స్ తీయగా, తీవ్రమైన దుర్వాసన వచ్చింది. దీంతో అతడు.. పోలీసుకు సమాచారమిచ్చాడు. పోలీసులు.. ఆ ప్రదేశంలో తవ్వగా కుళ్లిన స్థితిలో ఉన్న విజయ్ శవం బయటపడింది. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. మరింత లోతుగా విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. అద్దె ఇంటికి రూ. 23 లక్షలు అడ్వాన్స్‌

కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షల GST నోటీసు.. కారణమేంటంటే..?

మీరు జిమ్‌కి వెళ్తున్నారా.. అయితే ఇది మీ కోసమే

30 ఏళ్లకు వికసించిన కమలం మురిసిన కాశ్మీరం

స్విమ్మింగ్ పూల్ లో ఆఫీస్ డెస్కులు.. వినూత్న ఆలోచనకు ఉద్యోగులు ఫిదా..