కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షల GST నోటీసు.. కారణమేంటంటే..?
ఒక చిన్న కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షల GST నోటీసు వచ్చింది. దీనిని చూసి ఆ వ్యాపారి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆ మొత్తాన్ని ఎలా చెల్లించాలో అర్థంకాక తలపట్టుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని హవేరిలో జరిగింది. కూరగాయల వ్యాపారి శంకరగౌడ గత నాలుగు సంవత్సరాలుగా మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్ సమీపంలో ఒక చిన్న కూరగాయల దుకాణం నడుపుతున్నాడు.
అతని కస్టమర్లలో ఎక్కువ మంది యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపి కూరగాయలు కొంటారు. నాలుగు సంవత్సరాలలో జరిగిన రూ.1.63 కోట్ల లావాదేవీలకు జీఎస్టీ అధికారి నోటీసు పంపి రూ.29 లక్షలు చెల్లించమని కోరడంతో శంకరగౌడకు సమస్యలు తలెత్తాయి. శంకర్‌గౌడ ఏం చెప్పారంటే.. తాను రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలను తెచ్చి, తన చిన్న దుకాణం నుంచి అమ్ముతానని చెప్పాడు. తన కస్టమర్లలో ఎక్కువ మంది యూపీఐ ద్వారా చెల్లిస్తారని, క్యాష్ రూపంలో చెల్లించే కస్టమర్లు అరుదుగా వస్తారని చెప్పారు. తాను ఏటా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేస్తానని, అన్ని రికార్డులను సరిగ్గా ఉంచుతానని కూడా చెప్పాడు. కానీ ఈ అసాధ్యమైన మొత్తాన్ని జీఎస్టీగా చెల్లించమని అడిగినప్పుడు ఆశ్చర్యం కలిగిందన్నాడు. క్లియర్ ట్యాక్స్ ప్రకారం.. తాజా కూరగాయలు GST పరిధిలోకి రావు. కూరగాయల విక్రేతలు రైతుల నుండి నేరుగా కూరగాయలను కొనుగోలు చేసి, ఎటువంటి ప్రాసెసింగ్ లేకుండా తాజాగా విక్రయిస్తే వారు జీఎస్టీ పరిధిలోకి రారు. అయితే ఇటీవల కర్ణాటక జీఎస్టీ విభాగం యూపీఐ చెల్లింపులను అనుసరిస్తున్న వ్యాపారవేత్తలపై నిఘా ఉంచింది. పరిమితిని మించి టర్నోవర్ ఉన్నవారికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం నోటీసు పంపుతున్నట్లు తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీరు జిమ్‌కి వెళ్తున్నారా.. అయితే ఇది మీ కోసమే
30 ఏళ్లకు వికసించిన కమలం మురిసిన కాశ్మీరం
స్విమ్మింగ్ పూల్ లో ఆఫీస్ డెస్కులు.. వినూత్న ఆలోచనకు ఉద్యోగులు ఫిదా..
నాకు ఉద్యోగం ఇవ్వండి.. నా ట్యాలెంట్ ఏంటో చూపిస్తా..
వేగంగా కదులుతున్న రైల్లో రీల్స్ చేస్తున్న యువతి, ఇంతలో..
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

